మానవాళి నుదుటి మీద కరోనా (Corona) రాస్తున్న మృత్యు శాసనానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు. భారత్(India)లో కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపుతోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 33,750 కరోనా పాజిటివ్ కేసులు, 123 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ మహమ్మారి ప్రభావం ఇప్పుడు అన్ని రంగాలపై పడింది. క్రీడారంగంపై కూడా తన కన్ను వేసినట్టుంది. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో కరోనా ఎంట్రీ ఇచ్చింది. బెంగాల్ రంజీ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం బీసీసీఐ (BCCI) పునారాలోచనలో పడింది. టోర్నీ నిర్వహిస్తే పరిస్థితి ఏంటన్న మీమాంసలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గతేడాది జరగాల్సిన రంజీ ట్రోఫీ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు పెరిగిన కేసులతో మరోసారి రంజీ ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయ్.
దేశీయ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు బీసీసీఐ అత్యవసర సమావేశాన్ని నిర్వహించవచ్చు. తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, రంజీ ట్రోఫీ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ భద్రతా చర్యలు తీసుకుంది. బెంగాల్ క్రికెటర్లందరికీ RT-PCR పరీక్షలను నిర్వహించిందని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కార్యదర్శి స్నేహాశిష్ గంగూలీ తెలిపారు. ఇందులో ఏడుగురు ఆటగాళ్లు పాజిటివ్‌గా తేలింది.
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జనవరి 2, ఆదివారంతో ముగిసిన వారంలో దేశంలో 1.23 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 12 వారాల్లో ఇదే అత్యధిక కేసులు కావడం విశేషం. దీని కారణంగా గత వారం (డిసెంబర్ 20-26)లో 41,169 కేసులు నమోదయ్యాయి. అంటే, దేశంలో కరోనా సంక్రమణ రేటు ఒక వారంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. 82 వేల కేసులు పెరిగాయి.
ఇది కూడా చదవండి : 2022లో ఈ నాలుగు జరిగితే.. ఆ కిక్కే వేరే.. ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కల ఇది..
మరోవైపు, ముంబై స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబేకు కూడా కరోనా సోకింది. శివమ్‌తో పాటు, ముంబై జట్టులోని వీడియో విశ్లేషకుడు పాజిటివ్‌గా తేలాడు. శివమ్ స్థానంలో సాయిరాజ్ పటేల్‌ను ముంబై జట్టులోకి తీసుకున్నారు. 28 ఏళ్ల శివమ్ దూబే భారత్ తరఫున ఒక వన్డే, 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మహారాష్ట్ర, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల కోసం ముంబై జట్టులో అతనికి చోటు లభించింది. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోలా నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. 41 సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్ ముంబై ఎలైట్ గ్రూప్ సిలో ఉంది. కోల్‌కతాలో తన తొలి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Bengal, Corona cases, Corona effect, Cricket, Sports