CORONA POSITIVE FOR TWO OTHER MEMBERS IN TEAM INDIA AND STAFF GOING AWAY FOR THE FIFTH TEST PRV
Cricket: టీమిండియాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్.. ఐదో టెస్టుకు దూరం కానున్న వైనం
టీమిండియాలో కోచింగ్ సిబ్బందికి కరోనా
హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కి ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలగా.. అతనికి దగ్గరగా ఉన్న ఇద్దరికి కూడా కోవిడ్ పాజిటివ్ (Covid positive)గా తేలారు. ఈ విషయం సోమవారం వెలువడిన ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాల్లో వెలువడ్డాయి. వీరంతా ఐసోలేషన్‌లో ఉండనున్నారు. దీంతో ఈ ముగ్గురు ఐదో టెస్టుకు దూరం కానున్నారు.
క్రికెట్ టీమిండియా(team India)లో కరోనా(Corona) కలకలం సృష్టిస్తోంది. హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కి ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలగా.. అతనికి దగ్గరగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ (Bharath Arun), ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్(Sridhar)లకు కూడా కోవిడ్ పాజిటివ్ (Covid positive)గా తేలారు. ఈ విషయం సోమవారం వెలుగుచూసింది. దాంతో ఈ ముగ్గురూ 14 రోజుల పాటు ఐసోలేషన్(Isolation)లో ఉండనున్నారు. దీంతో శుక్రవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఐదో టెస్టుకి వీరు ముగ్గురూ దూరంగా ఉండనున్నారు. అయితే శ్రీధర్, భరత్ అరుణ్‌తో పాటు ఫిజియో థెరపిస్ట్ నితిన్ పటేల్ కూడా రవిశాస్త్రితో క్లోజ్‌గా ఉన్నాడని ఆదివారం నుంచి ఐసోలేషన్‌లో ఉంచారు. కానీ.. నితిన్ పటేల్‌కి ఈరోజు కరోనా నెగటివ్‌గా వచ్చింది. కాగా, టీమిండియాకు ఎల్లప్పుడూ అవసరమయ్యే ఈ ముగ్గురూ అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద దెబ్బే.
బ్యాటింగ్ కోచ్ మాత్రమే..
రవిశాస్త్రికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలగానే.. అతనితో క్లోజ్‌గా ఉన్న భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్‌లను ఐసోలేషన్‌లో ఉంచారు. దాంతో.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రమే టీమిండియాతో కలిసి కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియానికి నాలుగో టెస్టు కోసం ఆదివారం, ఈరోజు కూడా వచ్చాడు. ఐసోలేషన్‌లో ఉన్న భరత్ అరుణ్, శ్రీధర్‌కి ఆదివారం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయగా సోమవారం ఫలితాలు వచ్చాయి. ఇద్దరికీ పాజిటివ్‌గా తేలింది. దాంతో.. ఐదో టెస్టుకి ఈ కోచ్‌ల సాయం లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది.
ఇంగ్లాండ్ టూర్ మొదలైనప్పటి నుంచి భారత్‌కు కరోనా కష్టాలు తప్పట్లేదు. మొదట కరోనా ప్రోటోకాల్‌ను లెక్కచేయకుండా సిరీస్ మొదట్లో 20 రోజుల పాటు ఫుల్లుగా హాలీడేస్ ఎంజాయ్ చేసిన భారత జట్టు సభ్యుల్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ పాజిటివ్‌గా తేలాడు. అనంతరం ఐసోలేషన్‌లో ఉండి, నెగెటివ్‌గా తేలాక జట్టు సభ్యులతో కలిశాడు. ఆ రిషబ్‌పంత్‌కు కరోనా రావడానికి కారణం అతను ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్లినపుడు వచ్చింది. అయితే ఆ తర్వాత మరో కొంతమంది భారత జట్టు అసిస్టెంట్ కోచ్‌లు కూడా కరోనా లక్షణాలు ఉండటంతో ఐసోలేషన్‌కి వెళ్లారు.
ఇక శ్రీలంక టూర్లోనూ భారత్‌కు కరోనా బాగా ఇబ్బంది పెట్టింది. జట్టులోని సగం మంది సభ్యులను కరోనా వెంటాడింది. అసలే ఒక టీమ్ ఇంగ్లాండ్‌లో ఉండగా మరో టీమ్ అప్పట్లో శ్రీలంక బయలుదేరింది. బీ టీం అయిన భారత్ జట్టులో సగం మంది ఐసోలేషన్‌లో ఉండటంతో సిరీస్‌లో పాల్గొనే వారే కరువయ్యారు. ఏకంగా రిజర్వు బెంచీ ఆటగాళ్లను ఆడించారు మనోళ్లు. ఇదే కరోనా కారణంగా పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్ పర్యటన కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. వారు కొన్నిరోజులు ఐసోలేషన్‌లో గడిపి ఇంగ్లాండ్ టూర్‌కు పయనమయ్యారు. ఇపుడు ఏకంగా కోచ్ రవిశాస్త్రీ, భరత్ అరుణ్, శ్రీధర్‌లకు కరోనా సోకడంతో జట్టు సభ్యులు, బీసీసీఐలలో ఆందోళన మొదలైంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.