• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • CORONA EFFECT ON IPL 2021 FIVE DDCA GROUND STAFF TESTED CORONA POSITIVE AND SRH VS MI MATCH LIKELY TO BE POSTPONED SRD

IPL 2021 : ఢిల్లీ గ్రౌండ్ స్టాఫ్ ని వదలని కరోనా.. రేపటి మ్యాచ్ కూడా డౌటే..

IPL 2021 : ఢిల్లీ గ్రౌండ్ స్టాఫ్ కి కూడా కరోనా.. రేపటి మ్యాచ్ కూడా డౌటే..

IPL 2021 : అత్యంత పటిష్ట బయో బబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాళ్లలో ఇద్దరికి కరోనా సోకడం, ఆపై ఆ జట్టంతా ఐసోలేషన్‌లోకి వెళ్లడం చకచకా జరిగాయి. కరోనా ఎఫెక్ట్ తో ఇవాళ జరగాల్సిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది.

  • Share this:
    సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2021 (IPL 2021)కి కరోనా బ్రేకులు వేసినట్లే కన్పిస్తోంది. మహమ్మారి ప్రభావంతో ఐపీఎల్ 2021 నిర్వహణపై అనుమానాలు మొదలయ్యాయ్. అత్యంత పటిష్ట బయో బబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాళ్లలో ఇద్దరికి కరోనా సోకడం, ఆపై ఆ జట్టంతా ఐసోలేషన్‌లోకి వెళ్లడం చకచకా జరిగాయి. కరోనా ఎఫెక్ట్ తో ఇవాళ జరగాల్సిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది. ఆ మ్యాచ్‌ను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. కేకేఆర్‌ జట్టులో కరోనా కేసులు ఉన్న విషయం తెలిసిన గంటల వ్యవధిలోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్రికెటేతర సిబ్బంది ముగ్గురు వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆ జట్టు ప్రాక్టీస్ రద్దు చేసుకుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదాన సిబ్బంది ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం వారందరూ ఐసొలేషన్‌కు వెళ్లిపోయారట. ఢిల్లీ వైద్య బృందం వారికి ప్రత్యేక చికిత్స అందిస్తోంది. బయో బబుల్‌ వాతావరణంలో ఉన్నా కూడా ఏకంగా ఐదుగురికి వైరస్ సోకడం ఇప్పుడు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పెద్దల్లో ఆందోళన మొదలైంది. ఇక రేపు, ఢిల్లీలో జరిగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచుపైనా నీలినీడలు కమ్ముకున్నాయ్. మ్యాచ్ జరిగేది లేనిది రేపటి లోగా తేలనుంది. రాజస్థాన్‌, ముంబై, హైదరాబాద్‌, చెన్నై జట్లు మ్యాచుల కోసం మే 8 వరకు ఢిల్లీలోనే ఉండనున్నాయి.

    ఐపీఎల్ 2021 సీజన్‌ ఆరంభంలో ముంబై మైదానం సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓపెనర్ నితీశ్‌ రాణా వంటి ఆటగాళ్లూ కూడా పాజిటివ్‌గా తేలారు. అయినప్పటికీ ఐపీఎల్‌ పాలక మండలి టోర్నీని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. ఇప్పటికే సగం టోర్నీ ముగియగా.. బయో బుడగ పటిష్ఠంగానే ఉండటంతో బోర్డు ఊపిరి పీల్చుకుంది. ఉన్నపళంగా కరోనా కేసులు రావడంతో బీసీసీఐ కి తలనొప్పి మొదలైంది.

    ఇప్పటికే భారత్ లో కరనా కల్లోలం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడంపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు కేసులు పెరగడంతో బీసీసీఐ కూడా అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఇక, చాలా మంది క్రికెటర్లు కూడా స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ జరుగుతుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో పాకిస్థాన్ సూపర్ లీగ్ రద్దైంది. ఇప్పుడు అదే పరిస్థితి ఐపీఎల్ 2021 సీజన్ లో కూడా కన్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
    Published by:Sridhar Reddy
    First published: