• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • CORONA DISTURBED FTP OF ALL CRICKET BOARDS DO YOU KNOW HOW MANY SERIES HAVE POSTPONED OR CANCELLED JNK

Cricket: కరోనాతో క్రికెట్ బోర్డుల షెడ్యూల్ అతలాకుతలం.. ఏడాదిగా ఎన్ని సిరీస్‌లు రద్దయ్యాయో తెలుసా?

కరోనాతో పలు క్రికెట్ బోర్డుల షెడ్యూల్ అతలాకుతలం అయ్యింది.

కరోనా క్రీడారంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ప్రపంచవ్యాప్తంగా పలు క్రికెట్ బోర్డులు షెడ్యూల్ ప్రకారం సిరీస్‌లను పూర్తి చేయలేక నష్టాలపాలయ్యాయి. గత ఏడాదిగా ఎన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దయ్యాయో తెలుసా?

  • Share this:
    కరోనా సెకెండ్ వేవ్ (Corona Second Wave) ప్రభావంతో ఐపీఎల్ 2021 (IPL 2021) వాయిదా పడింది. మిగిలిన సీజన్ నిర్వహించకుంటే బీసీసీఐకి (BCCI) రూ. 2500 కోట్ల నష్టం కలుగుతుందని అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుగా పేరు తెచ్చుకున్న బీసీసీఐ కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతుంటే ఇక చిన్న బోర్డుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే చాలా సిరీస్‌లు (Cricket Series) వాయిదా పడటమే, రద్దు కావడమే జరిగింది. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాంలోని (ICC FTP) దాదాపు 150 రోజుల అంతర్జాతీయ క్రికెట్ రద్దయ్యినట్లు ఒక నివేదిక పేర్కొన్నది. ఈ మ్యాచ్‌లు రద్దు కావడంతో గత 12 నెలలుగా ఆయా క్రికెట్ బోర్డులు భారీ ఆర్దిక నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఒక్క బీసీసీఐ తప్ప ఇతర క్రికెట్ బోర్డులన్నీ ఈ నష్టాలను ఎలా పూడ్చుకోవాలో తెలియక పలు మార్గాల్లో డబ్బు ఆదా చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా తమ సిబ్బందిలో చాలా మందిని కాస్ట్ కటింగ్ పేరిట తొలగించాయి. మరోవైపు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 200 మిలియన్ డాలర్ల నష్టాన్ని చూడాల్సి వచ్చింది. ఈ రెండు బోర్డులే ఇలా నష్టాలతో బాధపడుతుంటే.. క్రికెట్ సౌతాఫ్రికా, శ్రీలంక క్రికెట్, క్రికెట్ వెస్టిండీస్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరింత దారుణంగా ఆదాయాన్ని కోల్పోయాయి.

    చాలా క్రికెట్ బోర్డులు తమ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి ఇబ్బందులు పడుతున్నాయి. గత ఏడాది ఐపీఎల్ ఏప్రిల్-మే నెలల్లో పూర్తి చేయాల్సి ఉన్నది. కానీ బీసీసీఐ సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో యూఏఈలో పూర్తి చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలని భావించినా కరోనా కారణంగో 29 మ్యాచ్‌ల అనంతరం వాయిదా పడింది. అయితే మరోసారి సెప్టెంబర్ అనంతరం ఐపీఎల్‌ను పూర్తి చేసే అవకాశం ఉన్నది. కాగా, అన్ని క్రికెట్ బోర్డులు బీసీసీఐ అంత అదృష్టవంతులు కావు. గత 12 నెలల్లో 15 అంతర్జాతీయ సిరీస్‌లు వాయిదా పడ్డాయి. కేవలం 30 శాతం మేర ఎఫ్‌టీపీ మాత్రమే పూర్తి చేశాయి. కేవలం ద్వైపాక్షిక సిరీస్‌లే కాకుండా గత ఏడాది టీ20 వరల్డ్ కప్, ఏసియా కప్ టీ20 టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి.

    గత 12 నెలల్లో రద్దయిన, వాయిదా పడిన పురుషుల క్రికెట్ సిరీస్‌లు

    శ్రీలంక - ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ (వాయిదా)
    ఇండియా - దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ (రద్దు)
    పాకిస్తాన్ - బంగ్లాదేశ్ (వాయిదా)
    ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ (రద్దు)
    శ్రీలంక - దక్షిణాఫ్రికా వన్డే, టీ20 సిరీస్ (రద్దు)
    బంగ్లాదేశ్ - న్యూజీలాండ్ టెస్ట్ సిరీస్ (రద్దు)
    పాకిస్తాన్ సూపర్ లీగ్ (వాయిదా)
    ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (ఆస్ట్రేలియా రద్దు)
    ఆసియా కప్ టీ20 సిరీస్ (వాయిదా)
    ఆఫ్గనిస్తాన్ - జింబాబ్వే (వాయిదా)
    దక్షిణాఫ్రికా - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ (రద్దు)

    మరోవైపు మహిళల క్రికెట్ మరింత దారుణంగా దెబ్బతిన్నది. గత కొన్ని నెలలుగా మహిళల విదేశీ పర్యటనలు, సిరీస్‌లు పూర్తిగా రద్దయ్యాయి. బీసీసీఐ 15 నెలల్లో కేవలం ఒకే ఒక సిరీస్‌ను ఏర్పాటు చేయగలిగింది.
    Published by:John Naveen Kora
    First published: