Ravindra Jadeja : రవీంద్ర జడేజాను ఇరుకున పెట్టిన ఫోటో.. వివాదంలోకి టీమిండియా ఆల్ రౌండర్

Photo Credit : Twitter

Ravindra Jadeja : సింహం పిల్లతో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దిగిన ఫోటో వైరల్ గా మారింది. అయితే, ఈ ఫోటోనే రవీంద్ర జడేజాను ఇరుకున పెట్టింది. తనకు తెలియకుండానే కాంట్రవర్సీగా మారాడు టీమిండియా ఆల్ రౌండర్.

  • Share this:
    సింహం పిల్లతో టీమిండియా ఆల్ రౌండర్ దిగిన ఫోటో వైరల్ గా మారింది. అయితే, ఈ ఫోటోనే రవీంద్ర జడేజాను ఇరుకున పెట్టింది. తనకు తెలియకుండానే కాంట్రవర్సీగా మారాడు టీమిండియా ఆల్ రౌండర్. ఇంతకీ ఏం జరిగిదంటే.. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్- ఐ కేటగీరి కింద కేటాయించబడిన జంతువులతో ఫోటోలు దిగరాదు. కానీ, రవీంద్ర జడేజా సింహం పిల్లతో దిగిన ఫోటోతో నేరం చేశాడని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఫోటో గుజరాత్ సింహానికి సంబంధించినది కాదు.. ఆఫ్రికన్ లైన్ దని అటవీ అధికారులు తెలిపారు. అసలు రవీంద్ర ఈ వివాదంలో ఇరుక్కోవడానికి కారణం ఉంది. ఈ వివాదానికి రవీంద్ర జడేజా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియోనే కారణం. ఆ వీడియోలో రాత్రి పూట మూడు సింహాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాయ్. ఈ వీడియోను తీసిన జడేజా ట్విట్టర్ లో పంచుకున్నాడు. " గొప్ప అనుభవం. ఈ రోడ్డు ట్రిప్ లో గొప్ప అనుభూతిని పొందాను " అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు రవీంద్ర జడేజా. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే, రవీంద్ర జడేజా ఈ వీడియో షేర్ చేసిన తర్వాత సింహాలు, వాటి పిల్లలతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    ఈ ఫోటో గుజరాత్ లైయన్స్ తో జడేజా దిగాడంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటవీ చట్టాల ప్రకారం గుజరాత్ సింహాలతో ఫోటోలు దిగడం నేరం. దీంతో ఉన్నతాధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. " రవీంద్ర జడేజా ఫోటోల్ని పరిశీలించాం. అయితే, ఈ ఫోటోలు గుజరాత్ లోనివి కావు. కచ్చితంగా ఆఫ్రికా లైయన్స్ కు సంబంధించినవి " అని అటవీ శాఖ ఉన్నతాధికారి తెలిపారు.


    రవీంద్ర జడేజా దిగిన ఫోటో ఇప్పుడుది కాదు. 2018 లో దక్షిణాఫ్రికా టూర్ సందర్భంగా జడేజా దిగిన ఫోటోలు. అయితే, జడేజా సింహాల వీడియో షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2016 లో ఇలాంటి తప్పిదమే చేసి భారీగా జరిమానా చెల్లించాడు. అప్పట్లో గుజరాత్ సింహాల దగ్గర ఫోటోల్ని దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో గుజరాత్ అటవీ శాఖ జడేజాకు 20 వేల రూపాయల ఫైన్ విధించింది. మళ్లీ ఇప్పుడు ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు.
    Published by:Sridhar Reddy
    First published: