Home /News /sports /

COMMONWEALTHGAMES 2022 INDIAN WOMEN CRICKETER RENUKA SINGH THAKUR IS TRUMP CARD FOR TEAM INDIA AGAINST ENGLAND IN SEMI FINALS SJN

CWG 2022 : భారత మహిళల జట్టులో లేడీ భువనేశ్వర్.. ఇన్ అండ్ అవుట్ స్వింగ్ బంతులతో హడలెత్తిస్తోన్న లేడీ సింగం

PC : TWITTER

PC : TWITTER

CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games)లో భారత (India) మహిళల జట్టు పతకానికి కేవలం విజయం దూరంలో నిలిచింది. టైటిల్ ఫేవరెట్లుగా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్ (England) జట్లు బరిలోకి దిగినా.. డార్క్ హార్స్ (Dark Horse)గా రేసులోకి దిగిన టీమిండియా (Team India) అదరగొడుతుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games)లో భారత (India) మహిళల జట్టు పతకానికి కేవలం విజయం దూరంలో నిలిచింది. టైటిల్ ఫేవరెట్లుగా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్ (England) జట్లు బరిలోకి దిగినా.. డార్క్ హార్స్ (Dark Horse)గా రేసులోకి దిగిన టీమిండియా (Team India) అదరగొడుతుంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన తొలి పోరులో అంచనాలకు మించి రాణించినా.. కాస్త ఒత్తిడికి గురవ్వడంతో గెలిచే మ్యాచ్ ను ఓడింది. అనంతరం పాకిస్తాన్ (Pakistan), బార్బడోస్ (Barbados) జట్లపై ఘనవిజయాలను సాధించిన హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే భారత్ సక్సెస్ వెనుక ఓ బౌలర్ కీలక పాత్ర పోషించింది. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి పని పట్టిన ఆమె.. టీమిండియాకు విజయాలను అందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది.

లేడీ భువీ అదరహో

రేణుక సింగ్ ఠాకూర్.. భారత ఉమెన్ క్రికెట్ లో ఇప్పుడో సంచలనం. లేడీ భువనేశ్వర్ గా అందరిచేత ప్రశంసలు అందుకొంటుంది.  లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఏకంగా 9 వికెట్లను నేలకూల్చింది. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడం రేణుక ప్రత్యేకత. ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టే రేణుకను ఎదుర్కోవడంలో తంటాలు పడింది.



ఇంగ్లండ్ లాంటి స్వింగ్ కు అనుకూలించే పిచ్ లపై రేణుక అద్భుత ప్రదర్శన చేస్తుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో 4 ఓవర్లు వేసిన ఆమె కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసింది. ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తన కోటా బౌలింగ్ లో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది. ఇక బార్బడోస్ తో జరిగిన కీలక మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన ఆమె కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇప్పటి వరకు మూడు మ్యాచ్ ల్లో 9 వికెట్లు తీసి సూపర్ ఫామ్ లో ఉంది. ఇక శనివారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో భారత్ అమీతుమీకి సిద్దమైంది. ఇందులో విజయం సాధిస్తే భారత్ కు కనీసం రజతం ఖాయం అవుతుంది. ఒకవేళ ఓడితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఓడిన టీంతో కాంస్యం కోసం ఆదివారం తలపడనుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, England, India vs england, India Vs Westindies, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు