Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 WATCH HOW INDIAN CYCLIST MEENAKSHI MET WITH AN HORROR ACCIDENT DURING THE RACE SJN

CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ లో మరో యాక్సిడెంట్.. తీవ్రంగా గాయపడ్డ భారత సైక్లిస్ట్.. ఏం జరిగిందంటే?

CWG 2022 : బర్మింగ్ హామ్ (birmingham) వేదికగా జరుగుతున్న కామన్వెల్స్ గేమ్స్ (Commonwealth Games) 2022లో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇప్పటికే పరుషుల సైక్లింగ్ ఈవెంట్ లో ప్రమాదం జరగ్గా.. తాజాగా మహిళల ఈవెంట్ లోనూ చోటు చేసుకుంది.

CWG 2022 : బర్మింగ్ హామ్ (birmingham) వేదికగా జరుగుతున్న కామన్వెల్స్ గేమ్స్ (Commonwealth Games) 2022లో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇప్పటికే పరుషుల సైక్లింగ్ ఈవెంట్ లో ప్రమాదం జరగ్గా.. తాజాగా మహిళల ఈవెంట్ లోనూ చోటు చేసుకుంది.

CWG 2022 : బర్మింగ్ హామ్ (birmingham) వేదికగా జరుగుతున్న కామన్వెల్స్ గేమ్స్ (Commonwealth Games) 2022లో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇప్పటికే పరుషుల సైక్లింగ్ ఈవెంట్ లో ప్రమాదం జరగ్గా.. తాజాగా మహిళల ఈవెంట్ లోనూ చోటు చేసుకుంది.

CWG 2022 : బర్మింగ్ హామ్ (birmingham) వేదికగా జరుగుతున్న కామన్వెల్స్ గేమ్స్ (Commonwealth Games) 2022లో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇప్పటికే పరుషుల సైక్లింగ్ ఈవెంట్ లో ప్రమాదం జరగ్గా.. తాజాగా మహిళల ఈవెంట్ లోనూ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారత సైక్లిస్ట్ మీనాక్షి (Meenakshi) తీవ్రంగా గాయపడింది. సోమవారం సైక్లింగ్‌లో 10కి.మీ స్క్రాచ్ రేసు జరిగింది. ఈ పోటీల్లో  భారత్‌ నుంచి మహిళా సైక్లిస్ట్‌ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కాసేపటికే ఈ మీనాక్షి సైకిల్‌పై నుంచి జారిపడి ట్రాక్‌ అంచుకు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన బ్రయోనీ బోథా సైకిల్‌ వేగంగా మీనాక్షిపై దూసుకెళ్లింది. అనంతరం బ్రయోనీ కూడా అదుపుతప్పి కింద పడిపోయింది.

ఇది కూడా చదవండి

వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది వీరిని ట్రాక్ నుంచి పక్కకు తీసుకువచ్చారు. అనంతరం వీరికి చికిత్స అందించారు. న్యూజిలాండ్ సైక్లిస్ట్ వెంటనే లేచి నిలబడగా.. భారత సైక్లిస్ట్ మాత్రం నొప్పితో విలవిల్లాడింది. మీనాక్షిని వెంటనే అక్కడి నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. కాగా ఈ ఈవెంట్‌లో ఇంగ్లండ్‌కు చెందిన లారా కెన్నీ స్వర్ణ పతకం గెలుచుకుంది. కాగా మీనాక్షి ప్రమాదానికి గురైన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



అంతకుముందు ఆదివారం కూడా పెను ప్రమాదం సంభవించింది. ఆదివారం పురుషుల విభాగంలో సైక్లింగ్ (cycling) రేసు జరగ్గా.. అందులో భారీ ప్రమాదం జరిగింది. రేసు ఆరంభం కాగా.. వేగంగా వెళుతున్న సైకిళ్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో వెనుకగా వస్తున్న కొన్ని సైకిళ్లు ఈ యాక్సిడెంట్ లో భాగం కాగా.. మరికొన్ని సైకిళ్లు తప్పించుకున్నాయి. అయితే ఇంగ్లండ్ (England) కు చెందిన రైడర్ మ్యాట్ వాల్స్ (Matt Walls)  ఈ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నంలో బారియర్స్ వైపు దూసుకెళ్లాడు. వాటిని దాటేసి ప్రేక్షకుల మీదకు దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురు ప్రేక్షకులు కూడా గాయపడ్డారు. లక్కీగా ఈ ప్రమాదంలో ఎవరూ కూడా గాయపడలేదు. ప్రేక్షకులు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే సమయంలో రైడర్ మ్యాట్ వాల్స్ కూడా చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నాడు. అతడిని పరిశీలించిన డాక్టర్లు చేతికి స్టిచెస్ వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, Dinesh Karthik, India, India Vs Westindies, Pv sindhu, Rohit sharma, Smriti Mandhana, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు