Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 WATCH CYCLIST TAKEN TO HOSPITAL SPECTATORS INJURED AFTER SCARY ACCIDENT AT COMMONWEALTH GAMES SJN

CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ లో పెను ప్రమాదం.. అదుపు తప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రైడర్.. అసలేం జరిగిందంటే?

PC : TWITTER

PC : TWITTER

Commonwealth Games 2022 : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 2022లో పెను ప్రమాదం సంభవించింది. ఆదివారం పురుషుల విభాగంలో సైక్లింగ్ (cycling) రేసు జరగ్గా.. అందులో భారీ ప్రమాదం జరిగింది.

Commonwealth Games 2022 : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 2022లో పెను ప్రమాదం సంభవించింది. ఆదివారం పురుషుల విభాగంలో సైక్లింగ్ (cycling) రేసు జరగ్గా.. అందులో భారీ ప్రమాదం జరిగింది. రేసు ఆరంభం కాగా.. వేగంగా వెళుతున్న సైకిళ్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో వెనుకగా వస్తున్న కొన్ని సైకిళ్లు ఈ యాక్సిడెంట్ లో భాగం కాగా.. మరికొన్ని సైకిళ్లు తప్పించుకున్నాయి. అయితే ఇంగ్లండ్ (England) కు చెందిన రైడర్ మ్యాట్ వాల్స్ (Matt Walls)  ఈ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నంలో బారియర్స్ వైపు దూసుకెళ్లాడు. వాటిని దాటేసి ప్రేక్షకుల మీదకు దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురు ప్రేక్షకులు కూడా గాయపడ్డారు.

లక్కీగా ఈ ప్రమాదంలో ఎవరూ కూడా గాయపడలేదు. ప్రేక్షకులు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే సమయంలో రైడర్ మ్యాట్ వాల్స్ కూడా చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నాడు. అతడిని పరిశీలించిన డాక్టర్లు చేతికి స్టిచెస్ వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



లాన్ బౌల్స్ లో భారత్ సంచలనం

కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games)లో భారత్ (India) తన పతకాల వేటను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం 6 పతకాలు సాధించిన భారత్.. మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. పెద్దగా పరిచయం లేని క్రీడ అయిన లాన్ బౌల్స్ (Lawan bowls)లో భారత మహిళల జట్టు ఫైనల్లో ప్రవేశించి చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 16-13తో న్యూజిలాండ్  (New Zealand)పై సంచలన విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఫైనల్ కు అర్హత సాధించింది. ఫైనల్లో ఓడినా కూడా భారత్ కు కనీసం రజత పతకం వస్తుంది. ఒకవేళ విజయం సాధిస్తే మాత్రం భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరడం ఖాయం. భారత జట్టులో రూపారాణి,  నయమోని సైనిక, లవ్లీ చౌబీ, పింకీ సింగ్ ఉన్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Accident, Commonwealth Game 2022, India Vs Westindies, Pv sindhu, Smriti Mandhana, Team India

తదుపరి వార్తలు