Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 INDIAN WOMEN TEAM REACH FINAL IN LAWN BOWLS AFTER DEFEATING NEW ZEALAND IN SEMI FINALS SJN

CommonWealth Games 2022 : లాన్ బౌల్స్ లో సంచలనం సృష్టించిన భారత్.. ఏకంగా ఫైనల్లో ప్రవేశం.. లాన్ బౌల్స్ రూల్స్ ఇవే..

PC : TWITTER

PC : TWITTER

CommonWealth Games 2022 : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games)లో భారత్ (India) తన పతకాల వేటను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం 6 పతకాలు సాధించిన భారత్.. మరో పతకాన్ని ఖాయం చేసుకుంది.

ఇంకా చదవండి ...
CommonWealth Games 2022 : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games)లో భారత్ (India) తన పతకాల వేటను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం 6 పతకాలు సాధించిన భారత్.. మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. పెద్దగా పరిచయం లేని క్రీడ అయిన లాన్ బౌల్స్ (Lawan bowls)లో భారత మహిళల జట్టు ఫైనల్లో ప్రవేశించి చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 16-13తో న్యూజిలాండ్  (New Zealand)పై సంచలన విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఫైనల్ కు అర్హత సాధించింది. ఫైనల్లో ఓడినా కూడా భారత్ కు కనీసం రజత పతకం వస్తుంది. ఒకవేళ విజయం సాధిస్తే మాత్రం భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరడం ఖాయం. భారత జట్టులో రూపారాణి,  నయమోని సైనిక, లవ్లీ చౌబీ, పింకీ సింగ్ ఉన్నారు.

లాన్ బౌల్స్ అంటే ఏమిటి

లాన్ బౌల్స్ అనేది ఇంచుమించుగా బౌలింగ్ క్రీడ మాదిరి ఉంటుంది. ఒక ఎండ్ నుంచి రౌండ్ గా ఉన్న బంతులను మరో ఎండ్ లో ఉన్న టార్గెట్ మీదకు వదలాలి. ఎవరిదైతే టార్గెట్ కు దగ్గరగా చేరుకుంటుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇక్కడ టార్గెట్ ను జాక్ గా పిలుస్తారు. ఉదాహరణకు ’బి‘ టీం కంటే కూాడా  ’ఎ‘ టీమ్ టార్గెట్ కు సమీపంగా రెండు బాల్స్ ను విసిరితే అప్పుడు ఎ టీంకు రెండు పాయింట్లు లభిస్తాయి. అంటే టార్గెట్ కు ఏ టీంవి ఎక్కువ దగ్గరగా ఉంటే అన్ని పాయింట్స్ ఇస్తారన్నమాట.



ఆదివారం రాత్రి వెస్ట్ బెంగాల్‌(West Bengal)కు చెందిన అచింత షూలి(20) మరో పతకాన్ని భారత్ ఖాతాలో చేర్చి వాటిని ఆరుకు పెంచాడు.   పురుషుల 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో అచింత షూలి(Achinta Sheuli) మొత్తంగా 313 కేజీలు ఎత్తి స్వర్ణ పతకం(Gold Medal) సాధించాడు. లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ వెయిట్‌లిఫ్టర్ స్నాచ్‌ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల బరువు లిఫ్ట్‌ చేశాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 140 కేజీలు.. మూడో ప్రయత్నంలో 143 ఎత్తి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్‌లోనూ అదే జోరు కొనసాగించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India Vs Westindies, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు