Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 INDIAN WEIGHT LIFTER GURURAJ PUJARY SECURES BRONZE MEDAL IN 61 KG CATEGORY SJN

CommonWealth Games 2022 : వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు మరో పతకం.. 61 కేజీ విభాగంలో కాంస్యం నెగ్గిన గురురాజ్ పుజారి

PC : TWITTER

PC : TWITTER

CommonWealth Games 2022 : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022 రెండో రోజు భారత్ (India) పతకాల పంట పండిస్తోంది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో భారత లిఫ్టర్లు రెండు పతకాలు సాధించారు.

CommonWealth Games 2022 : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022 రెండో రోజు భారత్ (India) పతకాల పంట పండిస్తోంది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో భారత లిఫ్టర్లు రెండు పతకాలు సాధించారు. తొలుత 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గార్ (sanket mahadev sargar) రజత పతకం సాధించగా.. అనంతరం జరిగిన 61 కేజీల విభాగంలో గురురాజ్ పుజాారి (Gururaj pujary) కాంస్య పతకం సాధించాడు. గురురాజ్ పుజారి మొత్తంగా 269 (118+151) కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. భారత్ కు కామన్వెల్త్ గేమ్స్ లో ఇది రెండవ పతకం కావడం విశేషం. మలేసియా లిఫ్టర్ మహ్మద్ బిన్ బిడిన్ 285 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. పపువా న్యూగినియా లిఫ్టర్ బరు 273 కేజీల బరువు ఎత్తి రజత పతకం సాధించాడు.

స్నాచ్ లో వెనుకబడినా

ఆరంభం నుంచి కూడా కాంస్య పతకం కోసం నువ్వా నేనా అన్నట్లు గురురాజ్, కెనడా లిఫ్టర్ యౌరి సిమార్డ్ మధ్య పోటీ నచ్చింది. స్నాచ్ లో భారత లిఫ్టర్ తొలి ప్రయత్నంలో 115 కేజీలు.. రెండో ప్రయత్నంలో 118 కేజీలు ఎత్తాడు. ఇక మూడో ప్రయత్నంలో 120 కేజీలు ఎత్తబోయి విఫలం అయ్యాడు. అయితే సిమార్డ్ మాత్రం తన మూడో ప్రయత్నంలో 119 కేజీలు ఎత్తాడు. ఇక క్లీన్ అండ్ జర్క్ లో సిమార్డ్ మూడో ప్రయత్నంలో 149 కేజీలు ఎత్తాడు. దాంతో ఓవరాల్ గా 268 కేజీలు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. అయితే గురురాజ్ తొలి రెండు ప్రయత్నాల్లో 144, 148 కేజీలు ఎత్తాడు. గురురాజ్ కు పతకం రావాలంటే చివరి ప్రయత్నంలో తప్పకుండా 151 కేజీలు ఎత్తాల్సి రాగా.. దానిని చేసి చూపించాడు. ఫలితంగా భారత్ కు రెండో పతకం ఖాయం అయ్యింది.



అంతకుముందు జరిగిన 55 కేజీల విభాగంలో బరిలోకి దిగిన సంకేత్ స్నాచ్ లో 113 కేజీలు బరువు ఎత్తాడు. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ లో మరో 135 కేజీలు ఎత్తాడు. దాంతో ఓవరాల్ గా మొత్తం 248 కేజీల బరువు ఎత్తి  రెండో  రెండో స్థానంలో నిలిచాడు ఫలితంగా భారత్ కు రజత పతకం సొంతమైంది. సంకేత్ కు ఇదే తొలి కామన్వెల్త్ గేమ్స్ కావడం విశేషం. మలేసియాకు చెందిన మొహమ్మద్ 249 కేజీల బరువు ఎత్తి బంగారు పతకాన్ని సాధించాడు. శ్రీలంక వెయిట్ లిఫ్టర్ దిలంక యోదగే 225 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India Vs Westindies, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు