హోమ్ /వార్తలు /క్రీడలు /

Nikhat Zareen : కామన్వెల్త్ గేమ్స్ లో తెలం’గానం‘.. స్వర్ణంతో సత్తా చాటిన నిజామాబాద్ బాక్సర్

Nikhat Zareen : కామన్వెల్త్ గేమ్స్ లో తెలం’గానం‘.. స్వర్ణంతో సత్తా చాటిన నిజామాబాద్ బాక్సర్

PC : TWITTER

PC : TWITTER

Nikhat Zareen : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games)లో భారత్ (India) పతకాల పంట పండిస్తోంది. ఆదివారం పురుషుల ట్రిపుల్ జంప్, మహిళల హాకీ లలో పతకాలు సాధించిన భారత్.. బాక్సింగ్ లో అయితే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Nikhat Zareen : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games)లో భారత్ (India) పతకాల పంట పండిస్తోంది. ఆదివారం పురుషుల ట్రిపుల్ జంప్, మహిళల హాకీ లలో పతకాలు సాధించిన భారత్.. బాక్సింగ్ లో అయితే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మహిళల విభాగంలో జరిగిన బాక్సింగ్ 50 కేజీల విభాగంలో నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన స్వర్ణ పతక పోరులో జరీన్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శంచింది. మెక్ నౌల్ (నార్త్ ఐర్లాండ్)తో ఫైనల్లో జరీన్ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని అందుకుంది. బాక్సింగ్ లో ఒకేరోజు భారత్ కు మూడు బంగారు పతకాలు రావడం విశేషం.

ఆరంభం నుంచే దూకుడు

మూడు రౌండ్ల పాటు జరిగిన ఫైనల్ పోరులో నిఖత్ జరీన్ ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. నిఖత్ జరీన్ పంచ్ లకు మెక్ నౌల్ కంటికి గాయం కూడా అయ్యింది. ఏ దశలోనూ ఆమె నిఖత్ దూకుడుకు సమాధానం ఇవ్వలేకపోయింది. ఇటీవలె నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో చాంపియన్ గా నిలిచింది కూడా. అదే దూకుడును ఇక్కడ కూడా ప్రదర్శించింది. హాట్ ఫేవరెట్ గా ఈ మెగా ఈవెంట్ లో అడుగుపెట్టిన నిఖత్ జరీన్ అంచనాలకు మించి రాణించింది.

అనేక అడ్డంకులను దాటుకుని

నిఖత్ జరీన్ ప్రస్తుతం అనుభవిస్తున్న సక్సెస్ అంత సులభంగా ఏమీ రాలేదు. ప్రతిభ ఉన్నా.. తాను ఎంచుకున్న కేటగిరీలో అప్పటికే భారత్ కు మేరీకామ్ లాంటి దిగ్గజం ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆరంభంలో నిఖత్ కు అవకాశాలు రాలేదు. మేరీ కామ్ వల్ల ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ కు దూరమైంది. అయితే మేరీ కామ్ పక్కకు తప్పుకోవడంతో ఈ ఏడాది నుంచి నిఖత్ 50 కేజీల విభాగంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ఈ క్రమంలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలవడంతో పాటు.. కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారి ఆడుతూనే ఏకంగా గోల్డ్ ను కొట్టేసింది.

First published:

Tags: Boxing, Commonwealth Game 2022, India vs australia, India Vs Westindies, Pv sindhu, Smriti Mandhana

ఉత్తమ కథలు