Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 IND W VS PAK W TEAM INDIA BEAT PAKISTAN BY 8 WICKETS SJN

IND W vs PAK W : పాకిస్తాన్ ను కుమ్మేసిన టీమిండియా.. టార్గెట్ ను చెమట పట్టకుండానే కొట్టేశారుగా..

PC : BCCI

PC : BCCI

IND W vs PAK W : కామన్వెల్త్ గేమ్స్ (commonWealth Games) 2022లో భారత (India) మహిళల జట్టు బోణీ కొట్టింది. ఆరంభ పోరులో ఆస్ట్రేలియా (Australia) చేతిలో ఓడిపోయి డీలా పడ్డ భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)పై పంజా విసిరింది.

ఇంకా చదవండి ...
IND W vs PAK W : కామన్వెల్త్ గేమ్స్ (commonWealth Games) 2022లో భారత (India) మహిళల జట్టు బోణీ కొట్టింది. ఆరంభ పోరులో ఆస్ట్రేలియా (Australia) చేతిలో ఓడిపోయి డీలా పడ్డ భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)పై పంజా విసిరింది. పతకం ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో భారత్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన కీలక పోరులో టీమిండియా 8 వికెట్లతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ గ్రూప్ ’ఎ‘లో టాప్ ప్లేస్ కు చేరుకుంది. 100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 11.4 ఓవర్లలోనే రెండు వికెట్లు నష్టపోయి 102 పరుగులు చేసి నెగ్గింది. స్టార్ ఓపెనర్లు స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ బ్యాటింగ్ తో టార్గెట్ ను ఉఫ్ మని ఊదేసింది.

చెమట పట్టకుండా

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన మంధాన, షఫాలీ వర్మ (9 బంతుల్లో 16, 2 ఫోర్లు, 1 సిక్స్) పాకిస్తాన్ వీక్ బౌలింగ్ పై ఎదురుదాడికి దిగారు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించారు. దాంతో భారత్ 5 ఓవర్లు ముగిసే సరికి 51 పరుగులకు చేరుకుంది. ముఖ్యంగా మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆమె ధాటిగి ఎలాంటి ఫీల్డింగ్ సెట్ చేయాలో తెలియక పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మారూఫ్ తికమక పడింది. బౌలర్లను మార్చినా మంధాన మాత్రం బౌండరీయే నా లక్ష్యం అన్నట్లు సాగింది. వీరు తొలి వికెట్ కు 61 పరగులు జోడించారు. షఫాలీ అవుటైన కాసేపటికే మంధాన అర్ధ సెంచరీని అందుకుంది. ఇండియా విజయం అందుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.



అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు భారత్ దెబ్బకు వణికిపోయింది. టీమిండియా (Team india) బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల కోసం నానా తంటాలు పడింది. వర్షం కారణంగా మ్యాచ్ ను ఇన్నింగ్స్ కు 18 ఓవర్లకు కుదించారు. తొలుత పాకిస్తాన్ సరిగ్గా 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, రాణా యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. రేణుక సింగ్, మేఘ్నా సింగ్, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ తీశారు. పాకిస్తాన్ తరఫున మునీబా అలీ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచింది.

2 ఓవర్లు 7 పరుగలు 5 వికెట్లు

16 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 5 వికెట్లకు 92 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో పాక్ దూకుడుగా ఆడుతుందనుకంటే చాలా దారుణంగా ఆడింది. చివరి రెండు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి మిగిలిన ఐదు వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. దాంతో పాకిస్తాన్ 100 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయింది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు సెమీఫైనల్ కు చేరడం దాదాపు కష్టమే.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India VS Pakistan, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు