Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 IND W VS PAK W PAKISTAN WON THE AND ELECTED TO BAT FIRST SJN

IND W vs PAK W : పాకిస్తాన్ తో మ్యాచ్.. టాస్ ఓడిన టీమిండియా.. రెండు మార్పులతో బరిలోకి.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

IND W vs PAK W : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 2022లో భాగంగా ఆదివారం బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు రంగం సిద్దమైంది. క్రికెట్ అభిమానులను అలరించేందుకు భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మహిళల జట్లు సిద్ధం అయ్యాడు. వర్షం కారణంగా టాస్ అరగంట ఆలస్యం అయ్యింది.

ఇంకా చదవండి ...
IND W vs PAK W : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 2022లో భాగంగా ఆదివారం బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు రంగం సిద్దమైంది. క్రికెట్ అభిమానులను అలరించేందుకు భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మహిళల జట్లు సిద్ధం అయ్యాడు. వర్షం కారణంగా టాస్ అరగంట ఆలస్యం అయ్యింది. అయితే టాస్ నెగ్గిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి పోరులో గెలిచే స్థితి నుంచి భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పాకిస్తాన్ కూడా తొలి పోరులో ఓడిపోయింది. దాంతో పతకం రేసులో ఉండాలంటే రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ కూడా కీలకంగా మారింది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేయగా.. పాకిస్తాన్ ఒక మార్పు చేసింది. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో విఫలం అయిన హర్లీన్ డియోల్, రాజేశ్వరి గైక్వాడ్ లపై భారత్ వేటు వేసింది. వీరి స్థానాల్లో స్నేహ్ రాణా.. మేఘ్నా సింగ్ లను తుది జట్టులోకి తీసుకుంది.

18 ఓవర్ల చొప్పున

వర్షం కారణంగా మ్యాచ్ 40 నిమిషాలు ఆలస్యంగా ఆరంభమైంది. దాంతో ఇన్నింగ్స్ కు 18 ఓవర్లకు కుదించారు. అంటే ప్రతి ఇన్నింగ్స్ కూడా 18 ఓవర్ల చొప్పున జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించడం రెండు జట్లకు కూడా ఎంతో కీలకం. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు పతకం రేసు నుంచి తప్పుకుంటాయి. ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంభ పోరుల ో భారత్ ఓడిపోగా.. బార్బడోస్ (వెస్టిండీస్)తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయింది. దాంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఇరు జట్లకు కూడా ఎంతో కీలకం,



ముఖాముఖి పోరులో భారత్ కే  ఆధిక్యం

ఇరు జట్లు ఇప్పటి వరకు 11 టి20 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో భారత్ 9 సార్లు విజయం సాధించగా.. పాకిస్తాన్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. ఇక మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఆరంభం కానుంది. సోనీ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

తుది జట్లు

టీమిండియా

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, యస్తిక భాటియా, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్, రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, మేఘ్నా సింగ్

పాకిస్తాన్

బిష్మా మహరూఫ్ (కెప్టెన్), ఐరమ్ జావెద్, మునీబా అలీ, సోహైల్, అలియా రియాజ్, నసీం, ఇమ్తియాజ్, ఫాతిమా సనా, తుబా హసన్, డియానా బైగ్, అనమ్ అమిన్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India VS Pakistan, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు