Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 IND W VS PAK W MATCH PREVIEW HEAD TO HEAD PREDICTED PLAYING XI PITCH REPORT WEATHER CONDITIONS SJN

IND W vs PAK W : పాకిస్తాన్ తో పోరు.. గెలిస్తేనే ముందుకు ఓడితే అంతే సంగతులు.. భారత తుది జట్టు ఇదే

PC : TWITTER

PC : TWITTER

IND W vs PAK W : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో భారత మహిళల జట్టు మరో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టుతో జరిగిన ఆరంభ పోరులో గెలవాల్సిన స్థితి నుంచి ఓడిన భారత జట్టు ఆదివారం పాకిస్తాన్ (Pakistan)తో కీలక పోరులో తలపడనుంది.

ఇంకా చదవండి ...
IND W vs PAK W : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో భారత మహిళల జట్టు మరో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టుతో జరిగిన ఆరంభ పోరులో గెలవాల్సిన స్థితి నుంచి ఓడిన భారత జట్టు ఆదివారం పాకిస్తాన్ (Pakistan)తో కీలక పోరులో తలపడనుంది. పతకం ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే పాకిస్తాన్ పై భారత్ తప్పక గెలవాలి ఒకవేళ ఓడితే గనుక భారత్ ఇంటిదారి పట్టడం ఖాయం.  పాకిస్తాన్ పరిస్థితి కూడా దాదాపుగా భారత్ లానే ఉంది. బర్బడోస్ (వెస్టిండీస్)తో జరిగిన పోరులో పాకిస్తాన్ 15 పరుగుల తేడాతో ఓడింది. దాంతో ఇరుజట్లకు కూడా ఈ పోరు కీలకం కానుంది.

బ్యాటింగ్ ఫర్వాలేదు.. బౌలింగే

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ అంచనాలకు మించి రాణించిందనేది వాస్తవం. అయితే కీలక సమయంలో పట్టు వదిలి ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్ లో భారత్ పటిష్టంగానే ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీ సాధిస్తే.. షఫాలీ వర్మ 48 పరగులతో సత్తా చాటింది. ఇక స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఉన్నంత సేపు ధాటిగా ఆడింది. అయితే యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్ లు తొలి మ్యాచ్ లో విఫలం అయ్యారు. వీరు రాణించాల్సి ఉంది. ఇక బౌలింగ్ లో రేణుక సింగ్ ఏకంగా నాలుగు వికెట్లతో మెరిసింది. దీప్తి శర్మ 2 వికెట్లు సాధించింది. అయితే రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ లు దారుణంగా విఫలం అయ్యారు. వీరిద్దరే 6 ఓవర్లు వేసి 60కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో రాధా యాదవ్ పై వేటు పడే అవకాశం ఉంది. ఆమె స్థానంలో పూనమ్ యాదవ్ ను తీసుకునే అవకాశం ఉంది. ఇక కరోనా బారిన పడ్డ పూజా వస్త్రాకర్ కోలుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆమె ఈ మ్యాచ్ కు దూరమైతే అది భారత్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.



ముఖాముఖి పోరులో భారత్ కే  ఆధిక్యం

ఇరు జట్లు ఇప్పటి వరకు 11 టి20 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో భారత్ 9 సార్లు విజయం సాధించగా.. పాకిస్తాన్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. ఇక మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఆరంభం కానుంది. సోనీ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

తుది జట్లు (అంచనా)

టీమిండియా

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, యస్తిక భాటియా, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India VS Pakistan, India Vs Westindies, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు