Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 IND W VS ENG W SEMI FINAL MATCH TEAM INDIA BEAT ENGLAND WOMEN BBY 4 RUNS AND ENTERS IN FINAL SJN

IND W vs ENG W : హోరాహోరీ పోరులో సంచలనం సృష్టించిన టీమిండియా.. ఇంగ్లండ్ పై సూపర్ విక్టరీ.. ఫైనల్లో ప్రవేశం

PC : TWITTER

PC : TWITTER

IND W vs ENG W : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో టీమిండియా (Team India) మహిళల జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత (India) మహిళల జట్టు 4 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND W vs ENG W : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో టీమిండియా (Team India) మహిళల జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత (India) మహిళల జట్టు 4 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ (England).. 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేసింది. తద్వారా భారత్ సూపర్ విక్టరీని అందుకుంది. స్నేహ్ రాణా రెండు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో భారత్ ఆదివారం జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్ కు అర్హత సాధించింది.

ఛేదనను ఇంగ్లండ్ జట్టు దూకుడుగా ఆరంభించింది. సోఫియా డంక్లీ (19), డాని వ్యాట్ (35) దూకుడుగా ఆడారు. సూపర్ ఫామ్ లో ఉన్న రేణుక సింగ్ వేసిన తొలి ఓవర్ లో ఏకంగా 15 పరుగులు రాబట్టారు. సోఫియా అవుటైయ్యాక.. అలైస్ (13) వెంటనే అవుటైంది. అయినా కెప్టెన్ నాట్ స్కీవర్ (41)తో కలిసి వ్యాట్ జట్టును ముందుకు నడిపించింది. అయితే అనవసరపు షాట్ కు ప్రయత్నించి డాని వ్యాట్ పెవిలియన్ కు చేరుకుంది. ఇక్కడి నుంచి భారత బౌలర్లు కమ్ బ్యాక్ చేశారు. దాంతో స్కీవర్, జోన్స్ (31) నెమ్మదిగా ఆడారు. భారత ఫీల్డర్లు మెరుపు ఫీల్డింగ్ కారణంగా వీరిద్దరూ పెవిలియన్ కు చేరుకున్నారు.



చివరి ఓవర్ థ్రిల్లర్

చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 14 రన్స్ అవసరం కాగా.. బౌలింగ్ కు స్నేహ్ రాణా వచ్చింది. తొలి బంతికి పరుగులు ఇవ్వని స్నేహ్ రాణా.. ఆ తర్వాతి బంతికి సింగిల్ ఇచ్చింది. ఇక మూడో బంతికి కేథరిన్ బ్రంట్ (0)ను స్నేహ్ రాణా బోల్తా కొట్టించింది. చివరి మూడు బంతులకు 11 పరుగులు అవసరం కాగా.. నాలుగు, ఐదు బంతులకు కేవలం రెండు పరుగులు సమర్పించుకుంది. ఇక చివరి బంతిని సిక్సర్ గా మలచిన ఎకెల్ స్టోన్ ఓటమి అంతరాన్ని తప్పించిందే తప్ప భారత విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరంభంలో రెచ్చిపోతే.. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) సూపర్ ఫినిష్ ఇచ్చింది. ఫలితంగా భారత్ కీలక పోరులో భారీ స్కోరును అందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో కెంప్ 2 వికెట్లు తీసింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India vs england, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు