Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 IND W VS ENG W SEMI FINAL MATCH LIVE SCORES TEAM INDIA SETS BIG TARGET FOR ENGLAND WOMEN SJN

IND W vs ENG W : కీలక పోరులో దంచి కొట్టిన స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

PC : ICC/TWITTER

PC : ICC/TWITTER

IND W vs ENG W : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో భాగంగా ఇంగ్లండ్ (England) మహిళల జట్టుతో జరుగుతోన్న తొలి సెమీఫైనల్లో భారత్ (India) అద్భుత ఆటతీరు కనబరుస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND W vs ENG W : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో భాగంగా ఇంగ్లండ్ (England) మహిళల జట్టుతో జరుగుతోన్న తొలి సెమీఫైనల్లో భారత్ (India) అద్భుత ఆటతీరు కనబరుస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా (Team india) 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరంభంలో రెచ్చిపోతే.. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) సూపర్ ఫినిష్ ఇచ్చింది. ఫలితంగా భారత్ కీలక పోరులో భారీ స్కోరును అందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో కెంప్ 2 వికెట్లు తీసింది.

దంచి కొట్టిన మంధానా

టాస్ నెగ్గి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పిచ్ పై పచ్చిక ఉండటంతో ఇది సరైన నిర్ణయం కాదేమో అని చాలా మందిలో అనుమానాలు తలెత్తాయి. అయితే  స్మృతి మంధాన బ్యాటింగ్ చూశాకా.. అవన్నీ పటాపంచలు అయ్యాయి. తొలి ఓవర్ నుంచే మంధానా అటాకింగ్ ఆటతో అదరగొట్టింది. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించి పరుగుల వర్షం కురిపించింది. మరో ఎండ్ లో ఉన్న షఫాలీ వర్మ (17) సింగిల్స్ కే పరిమితం అయ్యింది, వీరిద్దరూ చకాచకా తొలి వికెట్ కు 76 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మంధాన అర్ధ సెంచరీ అందుకుంది. అయితే వీరిద్దరు కూడా పరుగు తేడాతో పెవిలియన్ కు చేరుకున్నారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (20) నెమ్మదిగా ఆడారు. దాంతో భారత స్కోరు బోర్డు వేగం తగ్గింది. హర్మన్ భారీ స్కోరు చేయకుండానే పెలియన్ కు చేరుకుంది. ఇక దీప్తి శర్మ (22) చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. అనుకున్న స్థాయిలో భారీ షాట్లు ఆడలేకపోయింది. అయితే మరో ఎండ్ లో ఉన్న జెమీమా రోడ్రిగ్స్ ఆఖరి ఓవర్లలో తన బ్యాట్ కు పని చెప్పింది. ఫోర్లతో స్కోరు బోర్డును పెంచింది. జెమీమా సూపర్ ఫినిష్ ఇవ్వడంతో భారత్ మంచి స్కోరును సాధించగలిగింది.

తుది జట్లు

టీమిండియా

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, యస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, మేఘ్నా సింగ్, రేణుక సింగ్ ఠాకూర్

ఇంగ్లండ్

నాట్ స్కీవర్ (కెప్టెన్), డాని వ్యాట్, సోఫియా డంక్లీ, అలైస్ క్యాప్సె, అమీ జోన్స్, బౌచెర్, కేథరిన్ బ్రంట్, సోఫీ ఎకెల్ స్టోన్, కెంప్, వోంగ్, సారా గ్లెన్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India vs england, India Vs Westindies, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు