Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 IND W VS ENG W MATCH PREVIEW HEAD TO HEAD PREDICTED PLAYING XI PITCH REPORT WEATHER CONDITIONS SJN

IND W vs ENG W : ఇంగ్లండ్ తో ఫైనల్ కానీ ఫైనల్.. గెలిస్తే భారత్ కు పతకం గ్యారెంటీ.. లేదంటే మళ్లీ ఆడాల్సిందే.. తుది జట్టు ఇదే

PC : BCCI

PC : BCCI

IND W vs ENG W : ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టుతో జరిగిన టోర్నీ ఆరంభ పోరులో గెెలిచే స్థితి నుంచి అనూహ్యంగా గాడి తప్పి ఓటమిని ఆహ్వానించిన టీమిండియా (Team India) మహిళల జట్టు అనంతరం అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది.

IND W vs ENG W : ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టుతో జరిగిన టోర్నీ ఆరంభ పోరులో గెెలిచే స్థితి నుంచి అనూహ్యంగా గాడి తప్పి ఓటమిని ఆహ్వానించిన టీమిండియా (Team India) మహిళల జట్టు అనంతరం అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. పాకిస్తాన్ (Pakistan)పై సూపర్ విక్టరీ సాధించి ఆత్మవిశ్వాసాన్ని తిరగి సంపాధించిన హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాయకత్వంలోని భారత్.. లీగ్ లో చివరి మ్యాచ్ గా బార్బడోస్ (Barbados)తో జరిగిన పోరులోనూ జయకేతనం ఎగరవేసి నాలుగు జట్లతో ఉన్న గ్రూప్ ’ఎ‘లో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా సెమీఫైనల్ పోరుకు అర్హత సాధించింది. భారత్ తో పాటు ఆసీస్ కూడా సెమీస్ కు అర్హత సాధించింది. ఇక  అదే సమయంలో గ్రూప్ ’బి‘ నుంచి ఇంగ్లండ్ (England), న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి.

ఇది కూడా చదవండి : నిషేధం విధించినా సిగ్గు రాలేదా.. డబ్బు కోసం మళ్లీ ఆ మురికి కూపంలోకే వెళ్లిన బంగ్లా స్టార్ ఆల్ రౌండర్.. ఏం జరిగిందంటే?

ఈ నాలుగు జట్ల నుంచే మూడు జట్లు పతకదారులుగా మారనున్నారు. శనివారం జరిగే తొలి సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్ మహిళల జట్టుతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఫైనల్ కు చేరడంతో పాటు కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం కాంస్య పతకం పోరులో ఆస్ట్రేలియా, కివీస్ జట్లలో ఓడిన టీంతో ఆదివారం తలపడనుంది. బలాబలాలను బట్టి చూస్తే ఇరు జట్లు కూడా సమంగా ఉన్నాయి. అయితే సొంత గ్రౌండ్ లో ఆడుతుండటం ఇంగ్లండ్ కు కలిసి వచ్చే అంశం. అయితే కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ అద్భుత ఆటతీరుతో సత్తా చాటుతోంది. ఆస్ట్రేలియాపై సైతం దాదాపుగా విజయాన్ని సాధించినంత పని చేసింది. ముఖ్యంగా మంధాన, షఫాలీ వర్మలు సూపర్ ఫామ్ లో ఉన్నారు. బార్బడోస్ తో జరిగిన మ్యాచ్ లో జెమీమా అర్ధ సెంచరీతో చెలరేగింది. ఇక అదే సమయంలో హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మల రూపంలో భారత్ కు నాణ్యమైన ఫినిషర్లు ఉన్నారు.



బౌలింగ్ కూడా..

రేణుక సింగ్ ఠాకూర్ ఈ కామన్వెల్త్ గేమ్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది. ఆరంభంలో బంతులను రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తోంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో 9 వికెట్లు తీసి భారత్ విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈమె బౌలింగ్ ఇంగ్లండ్ ప్లేయర్ల సత్తాకు పరీక్షగా మారనుంది. పూజా వస్త్రాకర్ కూడా తుది జట్టులో చేరడంతో భారత్ బౌలింగ్ మరింత పటిష్టంగా మారింది.  మరోవైపు ఇంగ్లండ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ గాయంతో తప్పుకోవడం ఆ జట్టుకు సమస్యగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ డ్యానీ వ్యాట్, సోఫీ డంక్లీ,  సోఫీ ఎక్ లెస్టోన్, కేథరిన్ బ్రంట్ లు ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్లే.

టీమిండియా తుది జట్టు (అంచనా)

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, యస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, మేఘ్నా సింగ్, రేణుక సింగ్ ఠాకూర్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India vs england, India Vs Westindies, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు