Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 IND W VS ENG W 1ST SEMI FINAL LIVE SCORES INDIAN WOMEN TEAM WON THE TOSS AND ELECTED TO FIELD FIRST SJN

IND W vs ENG W : డూ ఆర్ డై మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా.. అందరి కళ్లూ ఆ బ్యాటర్లపైనే.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

IND W vs ENG W : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో భాగంగా మరికాసేపట్లో భారత్ (India), ఇంగ్లండ్ (England) మహిళల జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND W vs ENG W : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో భాగంగా మరికాసేపట్లో భారత్ (India), ఇంగ్లండ్ (England) మహిళల జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ నెగ్గిన భారత సారథి హర్మన్ ప్రీత్ కౌర్ (HarmanPreet Kaur) బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ కోసం ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుకు పతకం ఖాయం అవుతుంది. ఈ మ్యాచ్ తర్వాత ఇదే గ్రౌండ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ తో పాటు కాంస్య పతక పోరులు ఆదివారం జరగనున్నాయి.

ఈ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ నెగ్గిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకొని ఏమైనా తప్పు చేసిందా? అని కొందరిలో సందేహాలు మొదలయ్యాయి. ఇంగ్లండ్ సారథి నాట్ స్కీవర్ మాట్లాడుతూ తాము టాస్ నెగ్గి ఉంటే ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లం అని పేర్కొంది. ఇక ఇదే పిచ్ పై రెండో సెమీఫైనల్ తో పాటు రేపు ఫైనల్, కాంస్య పతకం కోసం మ్యాచ్ లు జరగనున్నాయి. దాంతో పిచ్ పై పచ్చిక కాస్త ఎక్కువగానే ఉంది. దాంతో ఆరంభంలో పేసర్లకు సహకరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రేణుక సింగ్ సూపర్ ఫామ్ ల ో ఉండటంతో భారత్ ఫీల్డింగ్ ఎంచుకుని ఉంటే మరింత మెరుగ్గా ఉండేదని అంటున్నారు. అయితే సెమీస్ లాంటి తీవ్ర ఒత్తిడి ఉన్న పోరుల్లో తొలుత బ్యాటింగ్ చేయడం కూడా ఒకరకంగా మంచిదే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.



అందరి కళ్లూ ఆమెపైనే

రేణుక సింగ్ ఠాకూర్ ఈ కామన్వెల్త్ గేమ్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది. ఆరంభంలో బంతులను రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తోంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో 9 వికెట్లు తీసి భారత్ విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈమె బౌలింగ్ ఇంగ్లండ్ ప్లేయర్ల సత్తాకు పరీక్షగా మారనుంది. పూజా వస్త్రాకర్ కూడా తుది జట్టులో చేరడంతో భారత్ బౌలింగ్ మరింత పటిష్టంగా మారింది.  మరోవైపు ఇంగ్లండ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ గాయంతో తప్పుకోవడం ఆ జట్టుకు సమస్యగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ డ్యానీ వ్యాట్, సోఫీ డంక్లీ,  సోఫీ ఎక్ లెస్టోన్, కేథరిన్ బ్రంట్ లు ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్లే.

తుది జట్లు

టీమిండియా

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, యస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, మేఘ్నా సింగ్, రేణుక సింగ్ ఠాకూర్

ఇంగ్లండ్

నాట్ స్కీవర్ (కెప్టెన్), డాని వ్యాట్, సోఫియా డంక్లీ, అలైస్ క్యాప్సె, అమీ జోన్స్, బౌచెర్, కేథరిన్ బ్రంట్, సోఫీ ఎకెల్ స్టోన్, కెంప్, వోంగ్, సారా గ్లెన్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, Dinesh Karthik, India Vs Westindies, Pv sindhu, Rohit sharma, Smriti Mandhana, Team India

తదుపరి వార్తలు