Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 IND W VS AUS W MATCH UPDATES CWG 2022 IND VS AUS FINAL AUSTRALIA WON THE TOSS AND ELECTED TO BAT FIRST SJN

IND W vs AUS W Gold Medal Match : గోల్డ్ మెడల్ మ్యాచ్ లో భారత్ కు చెడు శకునం.. తుది జట్లు ఇవే

PC : ICC

PC : ICC

IND W vs AUS W Gold Medal Match :  కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో మహిళల క్రికెట్ తొలిసారిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో 8 జట్లు బరిలోకి దిగగా.. భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్లే ఫైనల్ కు చేరాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND W vs AUS W Gold Medal Match :  కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో మహిళల క్రికెట్ తొలిసారిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో 8 జట్లు బరిలోకి దిగగా.. భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్లే ఫైనల్ కు చేరాయి. పసిడి పతకం కోసం మరికాసేపట్లో ఆరంభమయ్యే మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (Meg Lannin) బ్యాటింగ్ ఎంచుకుంది. 2020లో జరిగిన టి20 ప్రపంచకప్ లో జరిగిన ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడగా.. అప్పుడు కూడా భారత్ ఛేజింగ్ చేసింది. ఈ ఫైనల్లో కూడా భారత్ ఛేజింగ్ చేయాల్సి రావడం చెడు శకునంలా అభిమానులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు చేయలేదు.

ప్రతీకారంతో పాటు చరిత్ర

2020లో జరిగిన టి20 ప్రపంచకప్ లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం భారత్ కు దక్కింది. ఈ ఫైనల్లో భారత్ గెలిస్తే గనుక ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ లో క్రికెట్ విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన టీంగా భారత మహిళల జట్టు కొత్త చరిత్రను లిఖిస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో మంధానా, జెమీమా, షఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లు కీలకం కానున్నారు. ఇక బౌలింగ్ లో భారత్ మరోసారి స్పిన్ బౌలింగ్ పైనే ఆధారపడనుంది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో మెరిసినట్లే స్నేహ్ రాణా ఈ మ్యాచ్ లోనూ మెరిస్తే భారత్ ఈజీగా విజయం సాధించే అవకాశం ఉంది.



తక్కువగా అంచనా వేయకూడదు

భారత్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ను చూసిన వారు ఆ జట్టు గెలుస్తుందని ఊహించి ఉండరు. కానీ, గార్డ్ నర్ పోరాటపటిమ చూపడంతో ఆసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది. దాంతో ఆసీస్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే..  చరిత్ర లిఖించే అవకాశం ఉంది.

తుది జట్లు

టీమిండియా

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, యస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, మేఘ్నా సింగ్, రేణుక సింగ్ ఠాకూర్

ఆస్ట్రేలియా

అలీసా హీలీ, బెత్ మూనీ, మెగ్ ల్యానింగ్ (కెప్టెన్), తాహిలా మెక్ గ్రాత్, రాచెల్ హైన్స్, యాష్లే గార్డ్ నర్, గ్రేస్ హ్యారీస్, జెస్ జొనాసెన్, అలానా కింగ్, మేగాన్ ష్కట్, డార్సీ బ్రౌన్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, Hardik Pandya, India vs australia, India Vs Westindies, Pv sindhu, Sanju Samson, Shreyas Iyer, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు