CWG 2022 IND W vs AUS W : కామన్వెల్త్ గేమ్స్ (commonwealth games) 2022కు గురువారం తెరలేవనున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.30 నుంచి ఆరంభ వేడుకలు మొదలు కానున్నాయి. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ లో క్రికెట్ కు చోటు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసారికి కేవలం మహిళల క్రికెట్ లో అది కూడా టి20 ఫార్మాట్ లో పోటీలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలిరోజు బ్లాక్ బస్టర్ మ్యాచ్ తో క్రికెట్ పోటీలు ఆరంభం కానున్నాయి. ఆరంభ పోరులో ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టుతో భారత ఉమెన్స్ (india) టీం పోటీ పడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ శుక్రవారం మధ్యాహ్నం గం 3.30 నుంచి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ను సోనీ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
క్వారంటైన్ లోనే పుజా
కరోనా బారిన పడ్డ భారత స్టార్ బౌలర్ పూజా వస్త్రాకర్ ఇంకా క్వారంటైన్ లోనే ఉంది. దాంతో ఆమె తొలి మ్యాచ్ లో ఆడే అవకాశం దాదాపుగా లేదు. ఇక ఇటీవలె శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లో విజయం సాధించడంతో భారత జట్టు ఆత్మ విశ్వాసంతో ఉంది. అయితే ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టను ఢీకొట్టే సమయంలో అది ఎంత వరకు ప్రభావం చూపుతుందో తెలియదు. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ లతో భారత బ్యాటింగ్ పటిష్టంగానే కనిపిస్తుంది. అయితే వీరు సమష్టింగా ఆడాల్సి ఉంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు సమష్టిగా ఆడటంలో విఫలం అయిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఆస్ట్రేలియా ఎప్పటిలానే ఈ మ్యాచ్ లో ఫేవరెట్ అనే ట్యాగ్ తో బరిలోకి దిగుతుంది. ఓపెనర్ అలీసా హీలీ కెప్టెన్ మెగ్ ల్యానింగ్ ఆ జట్టుకు కొండంత అండ. ఇక పెర్రీ, బెత్ మూనీ, గార్డ్ నెర్ లతో పాటు బౌలింగ్ లో అనుభవం ఉన్న మేఘాన్ ష్కుట్, జొనాసెన్, క్యారీలు ముఖ్య పాత్ర పోషించనున్నారు.
పిచ్, వాతావరణం
మ్యాచ్ ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతుంది. ఇది బ్యాటింగ్ వికెట్. మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువ. దాంతో టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ కు ఎంచుకునే అవకాశం ఉంది. మ్యాచ్ కు వర్షం సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
టీమిండియా
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, యస్తిక భాటియా, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్
ఆస్ట్రేలియా
మెగ్ లానింగ్ (కెప్టెన్), అలీసా హీలీ, బెత్ మూనీ, పెర్రీ, తహిలా మెక్ గ్రాత్, రాచెల్ హైన్స్, గార్డ్ నర్, క్యారీ, జెస్ జొనాసెన్, అలానా కింగ్, మెగాన్ ష్కుట్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Commonwealth Game 2022, India vs australia, India Vs Westindies, Rohit sharma, Smriti Mandhana, Team India