Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 GOLD MEDAL MATCH TEAM INDIA FIELDERS RADHA YADAV AND DEEPTI SHARMA TAKES BLINDERS IN FINAL AGAINST AUSTRALIA WOMEN SJN

CWG 2022 : ధోనిలా రనౌట్.. జాంటీ రోడ్స్ లా క్యాచెస్.. ఫైనల్లో భారత ఫీల్డింగ్ మెరుపులు చూస్తే మీరు వావ్ అనాల్సిందే (వీడియో)

PC : TWITTER

PC : TWITTER

CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో భారత (India) మహిళల క్రికెట్ జట్టు తుది మెట్టుపై మరోసారి బోల్తా పడింది. ఆదివారం ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ 9 పరుగుల తేడాతో ఓడిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో భారత (India) మహిళల క్రికెట్ జట్టు తుది మెట్టుపై మరోసారి బోల్తా పడింది. ఆదివారం ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాయకత్వంలోని టీమిండియా (Team India)కు రజత పతకం లభించింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. పురుషుల క్రికెట్ కు ఏ మాత్రం తగ్గకుండా భారత ప్లేయర్లు మెరుపు విన్యాసాలతో అదరగొట్టారు. ముఖ్యంగా రాధా యాదవ్ (Radha Yadav), దీప్తి శర్మ (Deepti Sharma)లు ఫీల్డింగ్ లో మెరిపించారు.  రాధా యాదవ్ రనౌట్, క్యాచ్ లతో పాటు.. దీప్తి శర్మ ఒంటి చేత్తో పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి.

మొదట రాధా యాదవ్ తన అద్భుత ఫీల్డింగ్ తో మెరిసింది. అలీసా హీలీ తక్కువ స్కోరుకే అవుటైనా.. ఆస్ట్రేలియాను కెప్టెన్ మెగ్ ల్యానింగ్, బెత్ మూనీలు ఆదుకున్నారు. ఈ క్రమంలో ల్యానింగ్ అద్భుత షాట్లతో అలరించింది. ఆమె 36 పరుగుల వద్ద రాధా యాదవ్ సమయస్ఫూర్తికి రనౌట్ గా వెనుదిరిగింది. 11వ ఓవర్ వేయడానికి రాధా యాదవ్ బౌలింగ్ కు రాగా.. బెత్ మూనీ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉంది. ఆమె తొలి బంతిని స్ట్రయిట్ డ్రైవ్ ఆడింది. బంతిని ఆపిన రాధా.. క్షణంలో తన కాళ్ల మధ్య నుంచి నాన్ స్ట్రయికింగ్ వికెట్లను గిరాటేసింది. పరుగు కోసం క్రీజు వదిలిని ల్యానింగ్ క్రీజులోకి చేరుకోవడంలో విఫలం అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అచ్చం ధోనీలా రనౌట్ చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీని తర్వాత తహిలా మెక్ గ్రాత్ ఇచ్చిన క్యాచ్ ను కూడా బ్యాక్ వర్డ్ పాయింట్ లో రాధా యాదవ్ తన ఎడమవైపుకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నాయి.





ఆస్ట్రేలియా ప్లేయర్లు వరుస పెట్టి పెవిలియన్ కు చేరుతున్నా.. ఓపెనర్ బెత్ మూనీ మాత్రం మరో ఎండ్ లో ఫోర్లతో రెచ్చిపోయింది. 61 పరుగులు చేసిన ఆమె మరింత ప్రమాదకరంగా మారేలా కనిపించింది. అయితే స్నేహ్ రాణా బౌలింగ్ లో మిడాన్ మీదుగా భారీ షాట్ పడే ప్రయత్నం చేయగా.. అక్కడే ఉన్న దీప్తి శర్మ వెనక్కు పరుగెడుతూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకుంది. ఈ వీడియోనూ మీరూ చూసేయండి మరీ..


ఇక స్మృతి మంధాన కూడా ఫీల్డింగ్ లో రెచ్చిపోయింది. డైరెక్ట్ హిట్ తో జెస్ జొనాసెన్ ను రనౌట్ చేసింది. ఫీల్డింగ్ లో అద్భుత ప్రదర్శన చేసినా బ్యాటింగ్ లో మాత్రం భారత్ తడబడింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Commonwealth Game 2022, Dinesh Karthik, Hardik Pandya, India vs australia, India Vs Westindies, Pv sindhu, Rohit sharma, Smriti Mandhana, Team India

తదుపరి వార్తలు