Home /News /sports /

COMMONWEALTH GAMES 2022 CLOCK DID NOT START TWITTERATI VENT THEIR IRE AFTER MISTAKE BY OFFICIALS IN INDIA VS AUSTRALIA WOMENS HOCKEY SEMIFINAL SJN

CWG 2022 : అంపైర్ల తొండాట.. సెమీస్ లో భారత మహిళల జట్టుకు తీరని అన్యాయం.. ఆసీస్ ను గెలిపించిన రిఫరీ.. ఏం జరిగిందంటే?

PC : TWITTER

PC : TWITTER

CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games)లో భారత (India) మహిళల హాకీ జట్టుకు తీరని అన్యాయం జరిగింది. అంపైర్లు తొండి నిర్ణయాలతో భారత్ ను ఓడించారు. బర్మింగ్ హామ్ (Birmingham) కామన్వెల్త్ గేమ్స్ 2022లో జరిగిన మహిళల హాకీ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్, ఆస్ట్రేలియా (Australia) జట్లు తలపడ్డాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games)లో భారత (India) మహిళల హాకీ జట్టుకు తీరని అన్యాయం జరిగింది. అంపైర్లు తొండి నిర్ణయాలతో భారత్ ను ఓడించారు. బర్మింగ్ హామ్ (Birmingham) కామన్వెల్త్ గేమ్స్ 2022లో జరిగిన మహిళల హాకీ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్, ఆస్ట్రేలియా (Australia) జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో అంపైర్లు పక్షపాతం చూపించారు. ఆస్ట్రేలియాను గెలిపించేలా నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో చివరి వరకు భారత్ పోరాడినా ఓటమి వైపే నిలిచింది. మ్యాచ్ ఆరంభం కాగా.. ఇరు జట్లు కూడా గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. ఈ క్రమంలో మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసే లోగా ఇరు జట్లు కూడా 1-1 గోల్స్ తో సమంగా నిలిచాయి. దాంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారి తీసింది.

ఇక్కడే మ్యాచ్ రిఫరీలు భారత్ కు అన్యాయం చేశారు. పెనాల్టీ షూటౌట్ లో ఇరు జట్లకు ఐదు సార్లు గోల్ చేసే సమయం ఉంటుంది. అదే సమయంలో నిర్ణీత సమయంలో గోల్ చేయాలి. లేదంటే ఆ షాట్ ను పరిగణలోకి తీసుకోరు. ఈ క్రమంలో తొలుత ఆస్ట్రేలియా ప్లేయర్ గోల్ చేసేందుకు షాట్ తీసుకుంది. అయితే దీనిని భారత గోల్ కీపర్ సవిత పునియా అద్భుతంగా ఆడ్డుకుంది. అనంతరం భారత ప్లేయర్ గోల్ చేసేందుకు రాగా.. ఇక్కడే నాటకీయత ఆరంభమైంది. ఆస్ట్రేలియా ప్లేయర్ గోల్ చేసే సమయంలో తాను టైమర్ ను ఆన్ చేయలేదంటూ పేర్కొన్న రిఫరీ.. మరోసారి తొలుత విఫలమైన ఆసీస్ ప్లేయర్ కు గోల్ చేసేందుకు మరో అవకాశాన్ని ఇచ్చింది. అక్కడే ఉన్న భారత కోచ్ దీనిపై తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. అయినప్పటికీ రిఫరీ ఆసీస్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి సవిత తీవ్రంగా ప్రయత్నించినా గోల్ ను మాత్రం అడ్డుకోలేకపోయింది. ఇది భారత్ పై ప్రతికూల ప్రభావం చూపగా.. భారత్ పెనాల్టీ షూటౌట్ లో విఫలం అయ్యింది. దాంతో ఆస్ట్రేలియా షూటౌట్ లో 3-0గోల్స్ తేడాతో భారత్ పై విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. చీటర్స్ అంటూ రిఫరీలను భారత హాకీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.



అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన భారత కెప్టెన్, గోల్ కీపర్ సవిత పునియా మధ్యలో కన్నీటి పర్యంతం అయ్యింది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ’మీరు అద్భుతంగా పోరాడారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది‘ అన్నమాటలకు ఆమె ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆసీస్, ఇంగ్లండ్ జట్లు గోల్డ్ మెడల్ మ్యాచ్ కు అర్హత సాధించగా.. భారత్, న్యూజిలాండ్ జట్లు కాంస్య పతకం కోసం ఆడనున్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, Hockey, India Vs Westindies, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు