Home /News /sports /

COMMON WEALTH GAMES 2022 PV SNDHU WON GOLD MEDAL IN BADMINTON WOMENS SINGLES

CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ లో సింధు సంచలనం.. స్వర్ణంతో మెరిసిన తెలుగు తేజం

PC : Commonwealth Sport/Twitter

PC : Commonwealth Sport/Twitter

CWG 2022 : భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) సంచలనం నమోదు చేసింది. 2014 నుంచి కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో పాల్గొంటున్నా సింగిల్స్ విభాగంలో అందని ద్రాక్షలా ఊరిస్తోన్న స్వర్ణ పతకాన్ని ఈసారి సాధించేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
CWG 2022 : భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) సంచలనం నమోదు చేసింది. 2014 నుంచి కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో పాల్గొంటున్నా సింగిల్స్ విభాగంలో అందని ద్రాక్షలా ఊరిస్తోన్న స్వర్ణ పతకాన్ని ఈసారి సాధించేసింది. ప్రస్తుతం జరుగుతోన్న బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా సోమవారం మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో సింధు 21-15, 21-13తో మిచెల్ లీ (కెనడా)పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ చాంపియన్ తో పాటు డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు తాజాగా కామన్వెల్త్ గేమ్స్ లోనూ స్వర్ణ పతకాన్ని అందుకుంది. 2014లో జరిగిన కామన్వెల్త్ లో సింధు కాంస్యాన్ని అందుకోగా.. గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో రజత పతకాన్ని సాధించింది.

గత రెండు కామన్వెల్త్ గేమ్స్ లోనూ స్వర్ణాన్ని చేజిక్కించుకోలేకపోయిన సింధు.. ఈసారి ఆ అవకాశాన్ని వదిలిపెట్టకూడదనే పట్టుదలతో కనిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచే సింధు ప్రత్యర్థి మిచెల్ పై ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా పాయిట్లు సాధిస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. అయితే అనూహ్యంగా పుంజుకున్న మిచెల్ ఫైట్ బ్యాక్ చేసింది. అయితే తన అనుభవాన్ని ఉపయోగిస్తూ స్మాష్ షాట్లతో పాటు డిఫెన్స్ ఆడిన సింధు ప్రత్యర్థిని అనవసర తప్పిదాలను చేసేలా చేసింది. ఈ క్రమంలో ఆమె తొలి గేమ్ ను అందుకుంది. ఇక రెండో గేమ్ లో మరింతగా రెచ్చిపోయిన ఆమె సులభంగా విజయం సాధించింది. దాంతో సింధు ఖాతాలో స్వర్ణ పతకం చేరింది.



సింధు గోల్డ్ గెలవడంతో భారత్ పతకాల సంఖ్య 56కు చేరుకుంది. ఈ ఈవెంట్ లో భారత్ కు ఇది 19వ గోల్డ్ మెడల్ కావడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్ హిస్టరీలో భారత్ తరఫున సింధు 200వ పసిడి పతకం నెగ్గిన ప్లేయర్ గా నిలిచింది.   కామన్వెల్త్ గేమ్స్ చివరి రోజు అయిన సోమవారం బ్యాడ్మింటన్ లో భారత్ కు మరో రెండు గోల్డ్ మెడల్స్ దక్కే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్ తో పాటు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనున్నారు. దాంతో పాటు పురుషుల విభాగంలో కూడా భారత హాకీ జట్టు ఆస్ట్రేలియాతో స్వర్ణ పతకం కోసం పోటీ పడనుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, Pv sindhu, Smriti Mandhana, Team India

తదుపరి వార్తలు