Home /News /sports /

COCA COLA MARKET VALUE DECREASED AFTER RONALDO INCIDENT IN EURO CUP COKE SHARES LOST NEARLY 2 PERCENT JNK

Cristiano Ronaldo : రొనాల్డో దెబ్బకు భారీగా పడిపోయిన కోకాకోలా మార్కెట్ విలువ.. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?

వైరల్‌గా మారిన రొనాల్డో పాత కోక్ యాడ్

వైరల్‌గా మారిన రొనాల్డో పాత కోక్ యాడ్

క్రిస్టియానో రొనాల్డో మీడియా సమావేశంలో కోక్ బాటిల్స్ పక్కకు జరిపి వాటర్ తాగండి అని నినాదం ఇచ్చినందుకు కోక్ కంపెనీకి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కోక్ వెంటనే నష్టనివారణ చర్యలకు దిగింది. మరోవైపు 2006లో రొనాల్డో నటించిన కోకా కోలా యాడ్ కూడా వైరల్‌గా మారింది.

ఇంకా చదవండి ...
    క్రిస్టియానో రొనాలో (Cristiano Ronaldo).. ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులు అత్యంత ఇష్టపడే వ్యక్తి. దేశాలకు అతీతంగా రొనాల్డోపై విపరీతమైన అభిమానం పెంచుకున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం యూరో కప్ 2021లో పోర్చుగల్ జట్టుకు నడిపిస్తున్న ఈ దిగ్గజ ఫుట్‌బాలర్.. మల్టీ నేషనల్ కంపెనీ కోకాకోలాకు (Coca Cola) తీరని నష్టాన్ని చేకూర్చాడు. హంగేరీతో జరిగిన మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో కోకా కోలా బాటిల్స్ తీసి పక్కన పెట్టి.. నీళ్లు తాగండి అంటూ గట్టిగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. క్రిస్టియానో రొనాల్డో అలా చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. రొనాల్డో దెబ్బకు కోకాకోలా షేర్లు స్టాక్ మార్కెట్‌లో (Stock Market) 1.6 శాతం మేర నష్టపోయాయి. 242 బిలియన్ డాలర్లుగా ఉన్న కోకాకోలా మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా 238 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒకే రోజు దాదాపు రూ. 29 వేల కోట్ల రూపాయల విలువ ఆవిరై పోయింది. కేవలం క్రిస్టియానో రొనాల్డో చేసిన చిన్న పనికే అంత సంపద (Market Value) ఆవిరైనట్లు మార్కెట్ వర్గాలు కూడా స్పష్టం చేశాయి.

    యూరో కప్‌ను స్పాన్సర్ చేస్తున్న ఎంఎన్‌సీలలో కోకా కోలా కూడా ఒకటి. ఇప్పుడు యూరో కప్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలియదు కానీ.. మార్కెట్‌లో మాత్రం వేల కోట్లు నష్టపోయింది. వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన కోకాకోలా 'ప్రతీ ఒక్కరు తమకు నచ్చిన డ్రింక్‌ను ఎంచుకునే హక్కు ఉంది' అంటూ ఒక ప్రకటన చేసింది. మరోవైపు కోకాకోలా అభిమానులు మాత్రం రొనాల్డో తీరుకు మండిపడుతున్నారు. ఇప్పుడంటే అతడు కోక్ తాగట్లేదేమో కానీ.. 2006లో కోకాకోలా వాణిజ్య ప్రకటనలో నటించాడు కదా అంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. 2006లో జర్మనీలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా రూపొందించిన కోకాకోలా యాడ్‌లో రొనాల్డో నటించాడు. ఆ యాడో కోసం భారీ మొత్తాన్నే పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. అదే ఏడాది అతడు మొత్తం 12 మిలియన్ డాలర్ల విలువ చేసే వాణిజ్య ప్రకటనల ఒప్పందంపై సంతకం కూడా చేశాడు.



    ఇక హంగేరీతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. యూరో కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన మిచెల్ ప్లాటనీని దాటి టాప్ స్కోరర్‌గా రొనాల్డో నిలిచాడు. అయితే తన పిల్లలు కార్బొనేటెడ్ డ్రింక్స్‌పై మక్కువ పెంచుకుంటారనే బాధతోనే రొనాల్డో అలా చేసి ఉండొచ్చని సన్నిహితులు అంటున్నారు. నా కుమారుడు చిప్స్ తినడం, కోక్ తాగడం నాకు చిరాకు తెప్పిస్తుంటుందని గతంలో రొనాల్డో కామెంట్ చేశాడు. పిల్లలకు అలాంటి డ్రింక్స్ దూరంగా పెట్టాలని రొనాల్డో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. అందుకే మీడియా మీట్‌లో అలా వ్యవహరించి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Cristiano Ronaldo, EURO 2020, Euro Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు