Home /News /sports /

CHINESE TENNIS PLAYER PENG SHUAI TAKES HER SEXUAL ASSAULT COMMENTS AGAINST PRIME LEADER SRD

Peng Shuai: " అతను నాతో బలవంతంగా శృంగారం చేయలేదు " .. మాట మార్చిన టెన్నిస్ భామ..

పెంగ్ షుయ్

పెంగ్ షుయ్

Peng Shuai: పెంగ్ షుయ్ అదృశ్యం అనంతరం నోవాక్ జకోవిచ్, సెరేనా విలియమ్స్, నయోమీ ఒసాకా తమ గళాన్ని వినిపించారు. ఆమెను ఎక్కడ ఉన్నా వెంటనే ప్రజల ముందుకు తీసుకొని రావాలని కోరారు. డబ్ల్యూటీఏ చైర్మన్ స్టీవ్ సైమన్ కూడా వెంటనే ఆమె అదృశ్యంపై విచారణ జరపాలని చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
    చైనీస్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ పెంగ్ షుయ్ (Peng Shuai) గత కొన్ని రోజులుగా అదృశ్యమవడం క్రీడాలోకంలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అదృశ్యం కావడానికి ముందు ఆమె చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సదరు వ్యక్తి తనతో బలవంతంగా సెక్స్ చేశాడని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత కనపడకుండా పోవడంతో పెంగ్ షుయ్‌ని చైనా ప్రభుత్వమే ఏదో చేసిందనే ఊహాగానాలు వినిపించాయి. ఆమె క్షేమంగానే ఉన్నదని స్టేట్ మీడియా ప్రకటించినా ఎవరూ నమ్మలేదు.పెంగ్ షుయ్ అదృశ్యం అనంతరం టెన్నిస్ స్టార్లు జకోవిచ్, సెరేనా విలియమ్స్, నయోమీ ఒసాకా తమ గళాన్ని వినిపించారు. ఆమెను ఎక్కడ ఉన్నా వెంటనే ప్రజల ముందుకు తీసుకొని రావాలని కోరారు. డబ్ల్యూటీఏ చైర్మన్ స్టీవ్ సైమన్ కూడా వెంటనే ఆమె అదృశ్యంపై విచారణ జరపాలని చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    అయితే, లేటెస్ట్ గా పెంగ్ షుయ్ యూటర్న్ తీసుకుంది. తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన పెంగ్‌.. తాను అసలు ఎవరిపై ఆరోపణలు చేయలేదని చెప్పింది. అందుకు సంబంధించిన వార్తను సింగపూర్‌కు చెందిన ఓ ప్రముఖ చైనా దినపత్రిక ప్రచురించింది. "నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. నేనెప్పుడూ ఎవరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఫిర్యాదులు చేయలేదు. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నా " అని పెంగ్‌ అందులో వివరించింది.

    ఇది కూడా చదవండి :  టీమిండియా పాకెట్ డైనమైట్ రిషబ్ పంత్ కు బంపరాఫర్.. ఏకంగా...

    అయితే, నవంబర్‌ 2న ఆమె సోషల్ మీడియా ఖాతాలోనే.. చైనా మాజీ వైస్‌ ప్రీమియర్‌ జాంగ్‌ గవోలీపై చేసిన వ్యాఖ్యలు పై ప్రశ్నించగా .. అది తన వ్యక్తిగత విషయమని చెప్పింది. దాన్ని ప్రజలంతా తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. అయితే.. ఈ విషయంపై పూర్తి సమాచారం ఇవ్వలేదు. అలాగే ఆ పోస్టు తర్వాత పెంగ్‌ బాహ్య ప్రపంచానికి కనపడకుండా పోయేసరికి చైనాకు చెందిన ఓ అధికారిక పత్రిక.. ఆమె క్షేమంగానే ఉన్నట్లు డబ్ల్యూటీఏ చీఫ్‌ స్టీవ్‌ సైమన్‌కు ఈమెయిల్‌ చేసిన సంగతి తెలిసిందే.

    ఇది కూడా చదవండి : " భార్య, గర్ల్ ఫ్రెండ్స్ వల్లే ఇన్ని సమస్యలు " .. వైరలవుతున్న దాదా కామెంట్స్..

    అయితే, దీనిపై అప్పట్లో స్టీవ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ఈమెయిల్‌ స్క్రీన్‌షాట్లను వీడియోలో చూపించగా.. అది తాను స్వయంగా రాసిందేనని తాజాగా పెంగ్‌ చెప్పింది. ఆ సమయంలో పెంగ్‌ కనపడకపోవడంపై ఏమైనా కారణం ఉందా అని వీడియోలో ఒక వ్యక్తి ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, తాను ఎప్పుడూ స్వేచ్ఛగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే ఈ వీడియోలో ఆమె చైనీస్‌ బాస్కెట్‌ బాల్‌ స్టార్‌ ప్లేయర్‌ యోమింగ్‌తో కలిసి మాట్లాడినట్లు కూడా కనిపించింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: China, Sports, Tennis

    తదుపరి వార్తలు