చైనా ఓపెన్: సైనా అవుట్, ఫ్రీ క్వార్టర్స్‌లో సింధు

తొలి రౌండ్‌లోనే సైనా నెహ్వాల్‌కు చుక్కెదురు... చైనా ఓపెన్ ఫ్రీ క్వార్టర్‌లోకి ఎంటరైన పీవీ సింధు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 19, 2018, 3:57 PM IST
చైనా ఓపెన్: సైనా అవుట్, ఫ్రీ క్వార్టర్స్‌లో సింధు
పీవీ సింధు
  • Share this:
చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో అన్యూహ్యంగా వెనుదిరిగినా, పీవీ సింధు తొలి రౌండ్‌లో విజయం సాధించి, ఫ్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ 22-20, 8-21, 14-21 తేడాతో కొరియా ప్లేయర్ సంగ్ జీ హ్యూన్ చేతిలో ఓటమి పాలైంది. మొదటి సెట్ గెలుచుకున్నప్పటికీ, వరుసగా రెండు సెట్స్ కోల్పోయి తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్కమించింది ఈ మాజీ ఛాంపియన్.

పీవీ సింధు 21-15, 21-13 తేడాతో జపాన్ క్రీడాకారిణి సేనా కవాకమిపై వరుస సెట్స్‌లో విజయం సాధించి, ఫ్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఫ్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు థాయిలాండ్ ప్లేయర్ బుసానన్ ఓన్‌గారున్‌తో తలపడనుంది. సైనా నెహ్వాల్ తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఉంటే, సింధుతో క్వార్టర్స్‌లో పోటీ పడే అవకాశం ఉండేది.

డబుల్స్‌లో సుమిత్‌రెడ్డి- మను అత్రి జోడి 13-21, 21-13, 21-12 తేడాతో చైనీస్ తైపీ జోడి లియావో మిన్- సు చింగ్ హెంగ్ జోడిపై గెలిచి, రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా భారత ప్లేయర్లకు శుభారాంభమే దక్కింది. సిక్కిరెడ్డి- ప్రణవ్ చోప్రా జోడి 21-19, 21-17 తేడాతో జర్మన్ జోడి మార్విన్ ఎమిల్ సీదెల్- లిండా ఫెలెర్‌ను వరుస సెట్స్‌లో చిత్తు చేసి ఫ్రీక్వార్టర్‌లోకి ప్రవేశించింది.
First published: September 19, 2018, 3:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading