హోమ్ /వార్తలు /క్రీడలు /

Cheteshwar Pujara: పాక్ స్టార్ బౌలర్ అయితే నాకేంటి.. నాలుగో సెంచరీతో దుమ్మురేపిన పుజారా.. (వీడియో)

Cheteshwar Pujara: పాక్ స్టార్ బౌలర్ అయితే నాకేంటి.. నాలుగో సెంచరీతో దుమ్మురేపిన పుజారా.. (వీడియో)

Cheteshwar Pujara (Twitter)

Cheteshwar Pujara (Twitter)

Cheteshwar Pujara: ఈ మ్యాచ్​లో పాక్ స్టార్ బౌలర్ షహీన్ అఫ్రిదీపై ఆధిపత్యం చెలాయించాడు పుజారా. అప్పర్​కట్​తో బంతిని స్టాండ్స్​లోకి పంపించిన షాట్.. ఇన్నింగ్స్​కే హైలైట్​గా నిలిచింది. అందుకు సంబంధించి వీడియో వైరలవుతోంది.

  పేలవ ఫామ్ తో టీమిండియా (Team India) టెస్టు జట్టులో చోటు కోల్పోయిన భారత టెస్టు బ్యాటర్ చతేశ్వర్ పుజారా (cheteshwar pujara) ఇంగ్లండ్ (England) గడ్డపై రెచ్చిపోతున్నాడు. అక్కడ జరిగే కౌంటీల్లో సెంచరీల మోత మోగిస్తున్నాడు.ససెక్స్ టీమ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నయావాల్.. సెంచరీకి 'తగ్గేదే లే' అంటున్నాడు. తాజాగా, మిడిల్‌సెక్స్ జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో ససెక్స్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 170 పరుగులు చేశాడు. ఇందులో 22 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.ఈ సీజన్​లో అతడికిది నాలుగో సెంచరీ. అందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో మూడో ప్లేస్​​లో దూసుకెళ్తున్నాడు.

  ఇక, ఈ మ్యాచ్​లో పాక్ స్టార్ బౌలర్ షహీన్ అఫ్రిదీపై ఆధిపత్యం చెలాయించాడు పుజారా. అప్పర్​కట్​తో బంతిని స్టాండ్స్​లోకి పంపించిన షాట్.. ఇన్నింగ్స్​కే హైలైట్​గా నిలిచింది. పుజారా తొలి బంతి నుంచి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ప్రతి బంతిని కూడా మిడిల్ చేస్తూ తన మునుపటి ఫామ్ ను ప్రదర్శించాడు. ఫామ్ లేమి కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన పుజారా... తాజా ప్రదర్శనలతో మళ్లీ అందరి దృష్టిని తనవైపు మరల్చుకున్నాడు.

  ఈ మ్యాచ్‌లోనే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిదీ బౌలింగ్‌లో పుజారా అప్పర్‌ కట్‌తో సిక్స్ కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. మ్యాచ్ విషయానికొస్తే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ససెక్స్ 392 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 16 పరుగులే చేయగలిగాడు. అనంతరం మిడిల్‌సెక్స్ 358 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ససెక్స్ 68 ఓవర్లలో 4 వికెట్లకు 335 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పుజారా (170 నాటౌట్) అజేయంగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మిడిల్‌సెక్స్ వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది.

  ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ స్థానంలో ససెక్స్ జట్టులో చోటు దక్కించుకున్న పుజారా గత మూడు మ్యాచ్‌ల్లోనూ శతకాలు నమోదు చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 143.40 సగటుతో 717 పరుగులు చేశాడు. డెర్బీషైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 201 పరుగులు చేశాడు. ఆ తర్వాత వోర్సెస్టర్‌షైర్‌పై 109 పరుగులు, డర్హమ్ జట్టుపై 203 పరుగులు నమోదు చేశాడు.టీమిండియా తరఫున 95 టెస్టులు ఆడిన పుజారా 43.87 సగటుతో 6713 పరుగులు చేశాడు. ఇందులో 32 అర్ధసెంచరీలు, 18 సెంచరీలు ఉన్నాయి. ఇదే ప్రదర్శనను కంటిన్యూ చేస్తే త్వరలోనే తిరిగి టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cheteswar Pujara, Cricket, England, Pakistan, Team India

  ఉత్తమ కథలు