హోమ్ /వార్తలు /క్రీడలు /

praggnanandhaa : ఫైనల్లో పోరాడి ఓడిన భారత టీనేజ్ సంచలనం ప్రజ్ఞానంద.. శభాష్ అంటూ ప్రత్యర్థి చేత ప్రశంసలు

praggnanandhaa : ఫైనల్లో పోరాడి ఓడిన భారత టీనేజ్ సంచలనం ప్రజ్ఞానంద.. శభాష్ అంటూ ప్రత్యర్థి చేత ప్రశంసలు

ప్రజ్ఞానంద (ఫైల్ ఫోటో)

ప్రజ్ఞానంద (ఫైల్ ఫోటో)

praggnanandhaa : భారత చెస్ టీనెజ్ సంచలనం చరిత్రకు చేరువగా వచ్చి ఆగిపోయాడు. చెస్‌ఏబుల్‌ మాస్టర్స్‌ (chessable masters)  ఆన్‌లైన్‌ టోర్నమెంట్‌లో ఫైనల్ వరకు చేరిన రమేశ్ బాబు ప్రజ్ఞానంద (Rameshbabu Pragnanada).. తుది మెట్టుపై పోరాడి ఓడిపోయాడు.

ఇంకా చదవండి ...

praggnanandhaa : భారత చెస్ టీనెజ్ సంచలనం చరిత్రకు చేరువగా వచ్చి ఆగిపోయాడు. చెస్‌ఏబుల్‌ మాస్టర్స్‌ (chessable masters)  ఆన్‌లైన్‌ టోర్నమెంట్‌లో ఫైనల్ వరకు చేరిన రమేశ్ బాబు ప్రజ్ఞానంద (Rameshbabu Pragnanada).. తుది మెట్టుపై పోరాడి ఓడిపోయాడు. ఫైనల్లో ఇరువురు కూడా హోరాహోరీగా తలపడ్డారు. దాంతో మ్యాచ్ టై బ్రేక్ కు దారి తీసింది. టై బ్రేక్ లో నెగ్గిన చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ ప్రజ్ఞానందపై అద్భుత విక్టరీని సాధించి చాంపియన్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో ఓడినా కూడా ప్రజ్ఞానంద అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. డింగ్ లిరెన్ సైతం ప్రజ్ఞానందపై ప్రశంసల వర్షం కురిపించాడు. 16 ఏళ్లకే ఇలా ఆడుతున్నాడంటే.. రాబోయే కాలంలో అతడు గొప్ప ప్లేయర్ అవుతాడంటూ కితాబిచ్చాడు.

ఫైనల్ రెండు సెట్ ల ప్రకారం జరిగింది. తొలి సెట్ లో ప్రజ్ఞానంద  1.5-2.5తో లిరెన్ చేతిలో ఓడాడు. ఇక రెండో సెట్ లో పుంజుకున్న  ప్రజ్ఞానంద  2.5-1.5తో లిరెన్ పై సంచలన విజయం సాధించాడు. లిరెన్ ప్రస్తుతం ప్రపంచ రెండో ర్యాంకర్ కావడం విశేషం. ఇలా రెండు సెట్లలో చెరొకరు విజయం సాధించడంతో మ్యాచ్ టై బ్రేకర్ కు దారితీసింది. ఇక్కడ అద్బుతంగా ఆడిన లిరెన్  ప్రజ్ఞానందపై పైచేయి సాధించి విజేతగా నిలిచాడు.

ప్రపంచ నంబర్ 1 ను ఓడించి

ఈ టోర్నీలో ప్రజ్ఞానంద అంచనాలకు మించి రాణించాడు. చదరంగం ఆటలో తననెవరూ ఆపలేరంటూ సాగిపోతున్న కార్ల్ సెన్ కు ఈ 16 ఏళ్ల బుడతడు చెక్ పెట్టాడు.  ఐదో రౌండ్ లో కార్ల్ సెన్ తో ప్రజ్ఞానంద తలపడ్డాడు. తలపడటమే కాదు 41 ఎత్తుల్లో ప్రపంచ చెస్ చాంపియన్ పై జయకేతనం ఎగరవేశాడు. మ్యాచ్ లో ఇరువురు కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోటీ పడ్డారు. దాంతో మ్యాచ్ డ్రా అయ్యేలా కనిపించింది. అయితే 41వ ఎత్తులో తన గుర్రంతో తప్పుడు ఎత్తు వేసిన కార్ల్ సెన్ మూల్యం చెల్లించుకున్నాడు. సెమీఫైనల్లో కార్ల్ సెన్ పై లిరెన్ గెలిచి ఫైనల్ చేరుకున్నాడు.

First published:

Tags: Chess, China, India, IPL, IPL 2022

ఉత్తమ కథలు