Home /News /sports /

CHESSABLE MASTERS ONLINE RAPID CHESS TOURNEY INDIAN GRAN MASTER PRAGGNANANDHAA RAMESHBABU BEAT MAGNUS CARLSEN AGAIN SJN

Chess : అట్లుంటది మన 16 ఏళ్ల ప్రజ్ఞానందతోని.. దెబ్బకు చెస్ ప్రపంచ చాంపియన్ ఫ్యూజులు ఎగిరిపోయాయి

ప్రజ్ఞానంద రమేశ్ బాబు (PC : TWITTER)

ప్రజ్ఞానంద రమేశ్ బాబు (PC : TWITTER)

praggnanandhaa rameshbabu : చెస్ (Chess) ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సెన్ (magnus carlsen) కు మరోసారి దిమ్మతిరిగే షాక్ తగిలింది. చదరంగం ఆటలో తననెవరూ ఆపలేరంటూ సాగిపోతున్న కార్ల్ సెన్ కు భారత్ కు చెందిన 16 ఏళ్ల బుడతడు చెక్ పెట్టాడు.

ఇంకా చదవండి ...
praggnanandhaa rameshbabu : చెస్ (Chess) ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సెన్ (magnus carlsen) కు మరోసారి దిమ్మతిరిగే షాక్ తగిలింది. చదరంగం ఆటలో తననెవరూ ఆపలేరంటూ సాగిపోతున్న కార్ల్ సెన్ కు భారత్ కు చెందిన 16 ఏళ్ల బుడతడు చెక్ పెట్టాడు. చెస్ బుల్ మాస్టర్స్ ఆన్ లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ లో భారత్ కు చెందిన 16 ఏళ్ల  రమేశ్ బాబు  ప్రజ్ఞానంద (praggnanandhaa rameshbabu) దెబ్బకు 31 ఏళ్ల కార్ల్ సెన్ కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. శుక్రవారం జరిగిన ఐదో రౌండ్ లో కార్ల్ సెన్ తో ప్రజ్ఞానంద తలపడ్డాడు. తలపడటమే కాదు 41 ఎత్తుల్లో ప్రపంచ చెస్ చాంపియన్ పై జయకేతనం ఎగరవేశాడు. మ్యాచ్ లో ఇరువురు కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోటీ పడ్డారు. దాంతో మ్యాచ్ డ్రా అయ్యేలా కనిపించింది.

ఇది కూడా చదవండి : సింధు ఖేల్ ఖతం.. ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత చేతిలో ఘోర పరాభవం

అయితే 41వ ఎత్తులో తన గుర్రంతో తప్పుడు ఎత్తు వేసిన కార్ల్ సెన్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ విజయంతో టోర్నీలో  ప్రజ్ఞానంద 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో 15 పాయింట్లు సాధించిన కార్ల్ సెన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.


 ప్రజ్ఞానంద చేతిలో ఓడిపోవడం కార్ల్ సెన్ కు ఇదేమి కొత్త కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌ ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్ లో కేవ‌లం 39 ఎత్తుల్లోనే కార్ల్‌ సెన్‌ను చిత్తుగా ఓడించి ప్రజ్ఞానంద సంచ‌ల‌నం సృష్టించాడు. తమిళనాడుకు చెందిన‌ ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదాను సాధించడం విశేషం. అంతేకాకుండా భారత దిగ్గజ‌ చెస్ ప్లేయర్ విశ్వనాథన్‌ ఆనంద్ రికార్డును సైతం అతడు బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా ద‌క్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో గ్రాండ్ మాస్టర్ హోదాను ద‌క్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్రజ్ఞానంద ప్రపంచ రికార్డు నెల‌కొల్పాడు.


విజయం తర్వాత ప్రజ్ఞానంద మాట్లాడిన తీరు అందరి చేత శభాష్ అనిపించేలా చేస్తోంది. ’అవును ఇదొక గొప్ప విజయం. అలా అని గొప్పగా సెలబ్రేట్ చేసుకోల్సిన అవసరం లేదు. నాకు సమయం ఉన్నా నేను ఈ గేమ్ లో విజయం సాధించినందుకు సెలబ్రేట్ చేసుకోను. చెస్ లో కొన్ని సార్లు గెలుస్తుంటాం మరికొన్ని సార్లు ఓడిపోతుంటాం. ఓటమి ఎప్పుడు ఎండ్ కార్డ్ కాదు‘అంటూ తన వయసుకు మించిన పరిణతితో మాట్లాడారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chess, IPL, IPL 2022

తదుపరి వార్తలు