Home /News /sports /

CHENNAI SUPERKINGS BATTER AMBATI RAYUDU DECIDES STEPPING DOWN FROM FRANCHISE CRICKET AFTER TEAMS EXIT FROM IPL 2022 SRD

Ambati Rayudu : అంబటి రాయుడు సంచలనం నిర్ణయం.. ఇక, మిగిలింది రెండు మ్యాచులే..

Ambati Rayudu

Ambati Rayudu

Ambati Rayudu : ప్రస్తుతం అంబటి రాయుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ లో అంబటి రాయుడును 6.75 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది.

    చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్.. తెలుగు తేజం అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ టోర్నీకి తాను రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు తాజాగా ప్రకటించాడు ప్లేయర్‌ అంబటి రాయుడు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం అంబటి రాయుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ లో అంబటి రాయుడును 6.75 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది.ఐపీఎల్‌ లో తన ప్రయాణానికి సహకరించిన.. ముంబై మరియు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు అంబటి రాయుడు. ఈ సందర్భంగా భావోద్వేగపు ట్వీట్ చేశాడు.

    “ఇది నా చివరి ఐపిఎల్ అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. నేను 13 సంవత్సరాలుగా 2 గొప్ప జట్లలో భాగమైనందుకు అద్భుతమైన సమయాన్ని కలిగి ఉన్నాను. అద్భుతమైన ప్రయాణం కోసం ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.” అంటూ క్రికెటర్‌ అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. అయితే, ఈ ట్వీట్ ను కాసేపటికే డిలీట్ చేశాడు.



    ఐపీఎల్ లో ఇప్పటివరుకు 187 మ్యాచులాడిన రాయుడు.. 4,187 పరుగులు చేశాడు. యావరేజ్ 30. ఇందులో ఒక సెంచరీతో పాటు 22 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయ్. 2019 వరల్డ్ కప్ అప్పుడు రాయుడ్ని టీమిండియాలోకి తీసుకోకవడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. ఎమ్ఎస్కే ప్రసాద్ రాయుడు బదులు త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ ని తీసుకున్నామని చెప్పడం అప్పట్లో దుమారం రేపింది.

    ఇక, ఐపీఎల్ 2022 సీజన్‌లో 12 మ్యాచ్‌లాడి 27.10 సగటుతో 271 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. తాజా సీజన్ లీగ్ దశలో ఇక చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండగా.. తన కెరీర్‌లో ఇది చివరి ఐపీఎల్ సీజన్ అని అంబటి రాయుడు శనివారం ప్రకటించేశాడు. ఇప్పటికే ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించిన విషయం తెలిసిందే.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Ambati rayudu, Chennai Super Kings, Cricket, IPL 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు