MIvsCSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఇవే తుది జట్టు వివరాలు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్

MIvsCSK: దుబాయ్ వేదికగా ముంబై-చెన్నై జట్ల మధ్య ఐపీఎల్ రెండో దశ తొలి మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెల్చిన ధోనీ బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు.

  • Share this:
    యూఏఈ (UAE) వేదికగా ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ ప్రారంభమైంది. ఈ సీజన్ మ్యాచ్ నెంబర్ 30 ముంబై ఇండియన్స్ (Mumbai Indians) - చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్ల మధ్య జరుగుతున్నది. టాస్ గెల్చిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ముంబై ఇండియన్స్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి బదులుగా పొలార్డ్ ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. యువ క్రికెటర్ అనుమోల్ ప్రీత్ సింగ్ ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేస్తున్నాడు. ముంబై పేసర్ జస్ప్రిత్ బుమ్రా, సీఎస్కే ఆటగాడు బ్రావోకు ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం.

    దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ ముంబై గెలిస్తే మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published: