Home /News /sports /

CHENNAI SUPER KINGS SUPERB VICTORY ON KOLKATA KNIGHT RIDERS BY 2 WICKETS JNK

CSK vs KKR: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం.. బెదరగొట్టిన కేకేఆర్ బౌలర్లు.. అదరగొట్టిన జడేజా

వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (PC: IPL)

వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (PC: IPL)

CSK vs KKR: ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆఖర్లో వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ వికెట్లు తీసి బెదరగొట్టినా రవీంద్ర జడేజా చెలరేగి ఆడటంతో సీఎస్కే విజయం సాధించింది.

    ఐపీఎల్ 2021లో భాగంగా అబుదాబిలో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్బుత విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ ప్రేక్షకులను టెన్షన్ పెట్టింది. కోల్‌కతా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (40), ఫాఫ్ డు ప్లెసిస్ (43) కలసి తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే  ఆండ్రీ రస్సెల్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్.. ఇయాన్ మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దూకుడుగా ఆడుతున్నఫాఫ్ డు ప్లెసిస్ (43)ను  ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌ అవుట్ చేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన డుప్లెసిస్.. లాకీ ఫెర్గూసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంబటి రాయుడు (10) తో పాటు అప్పటి వరకు క్రీజులో పాతుకొని పోయిన మొయిన్ అలీ (32) అవుటయ్యాక మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

    రన్‌రేట్ పెరిగిపోతుండటంతో సురేశ్ రైనా (11) పరుగుల కోసం ప్రయత్నించి రనౌట్‌  అయ్యాడు. ఇక ఎంఎస్ ధోనీ (1) మరోసారి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐపీఎల్‌లో వరుణ్.. ధోనీని బౌల్డ్ చేయడం ఇది మూడో సారి. దీంతో మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ వైపు మలుపు తిరిగింది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సర్ రవీంద్ర జడేజా కేవలం 8 బంతుల్లో 2 సిక్సులు, 2 ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు. చివరి వోవర్ వేసిన సునిల్ నరైన్ మొదట సామ్ కర్రన్‌ను అవుట్ చేశాడు. ఇక ఐదో బంతికి రవీంద్ర జడేజాను ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ పంపాడు. అప్పటికే ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఆఖరి బంతికి ఒక పరుగు కావల్సి ఉండగా దీపక్ చాహర్ ఎలాంటి ఒత్తిడికి గురవ్వకుండా సింగిల్ తీసి చెన్నై జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.



    ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా ప్లేఆఫ్స్ ప్లేస్‌ను ఖరారు చేసుకున్నది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్ కోసం మరింత కష్టపడాల్సి వస్తున్నది. తర్వాత జరిగే మ్యాచ్‌లలో కనీసం 3 మ్యాచ్‌లు అయినా గెలవాల్సి ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Chennai Super Kings, IPL 2021, Kolkata Knight Riders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు