మరో రికార్డు క్రియేట్ చేసిన సురేష్ రైనా... ఐపీఎల్ స్పెషలిస్ట్ ఖాతాలో మరో అరుదైన ఘనత...

ఐపీఎల్ కెరీర్‌లో వంద క్యాచ్‌లు అందుకున్న మొదటి ఫీల్డర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన సురేష్ రైనా....

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 2, 2019, 5:17 PM IST
మరో రికార్డు క్రియేట్ చేసిన సురేష్ రైనా... ఐపీఎల్ స్పెషలిస్ట్ ఖాతాలో మరో అరుదైన ఘనత...
ఈ ప్రమాదంలో మరికొందరూ గాయపడగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కానీ రైనా మేనత్త ఆశా రాణి పరిస్థితి మాత్రం ఇంకా సీరియస్‌గానే ఉంది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ప్రభుత్వం స్పెషల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ని నియమించింది. దాదాపు నెల రోజుల పాటు దర్యాప్తు చేసిన ఈ బృందం 100మంది అనుమానితుల్ని విచారించింది. ఎట్టికేలకు ఈ దాడిలో పాల్గోన్న నిందితులను అరెస్ట్ చేసింది.
  • Share this:
సురేష్ రైనా... ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ క్రికెటర్... ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. అయితే ఏడాదికోసారి జరిగే ఐపీఎల్‌లో మాత్రం పరుగుల వరద పారిస్తుంటారు సురేష్ రైనా. అందుకే రైనాను చాలామంది ‘ఐపీఎల్ స్పెషలిస్ట్’ అని పిలుస్తుంటారు. ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా వరుస మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సురేష్ రైనా... ఐపీఎల్‌లో 5 వేల పరుగుల మైలురాయి దాటిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచి, చరిత్ర సృష్టించాడు. తాజాగా ఈ యూపీ ప్లేయర్ ఖాతాలో మరో సరికొత్త రికార్డు చేరింది. ఐపీఎల్ కెరీర్‌లో వంద క్యాచ్‌లు అందుకున్న మొదటి ఫీల్డర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు సురేష్ రైనా. మే1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీషా ఇచ్చిన క్యాచ్ అందుకున్న సురేష్ రైనా... వంద క్యాచ్‌లు పూర్తిచేసుకుని, ఈ ఘనత క్రియేట్ చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు. సురేష్ రైనా తర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ 84 క్యాచులు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 82 క్యాచ్‌లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

వికెట్ కీపర్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ కమ్ కీపర్ దినేశ్ కార్తీక్ మాత్రం 100 క్యాచులు అందుకున్నాడు. మిగిలిన జట్లతో ఏ కీపర్ కూడా వంద క్యాచులను అందుకోలేకపోయారు. తన ఐపీఎల్ కెరీర్‌లో 189వ మ్యాచ్ ఆడుతున్న సురేష్ రైనా... 37 హాఫ్ సెంచరీలతో అత్యధక అర్ధశతకాలు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టీ20ల్లో 8 వేలకు పైగా పరుగులు సాధించిన మొదటి క్రికెటర్ కూడా రైనానే. కొన్నాళ్ల క్రితం ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో తన దృష్టిలో సురేష్ రైనాయే బెస్ట్ ఫీల్డర్ అని తేల్చేశాడు ‘ఆల్‌టైమ్ బెస్ట్ ఫీల్డర్’ జాంటీ రోడ్స్. ‘మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియాలో మైదానాలు వేరేగా ఉంటాయి. అలాంటి చోట ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. అయితే రైనా మాత్రం ఎంతో కష్టపడి ఫీల్డింగ్ మీద ఫోకస్ పెడతాడు. బంతి వస్తోందంటే చాలు... గాల్లోకి ఎగిరి దాన్ని ఒడిసిపట్టేందుకే ఆలోచిస్తాడు. బంతిని అందుకోవాలనే తపన, తాపత్రయం అతనిలో కనిపిస్తాయి...’ అని సురేశ్ రైనాను ఆకాశానికి ఎత్తేశాడు రోడ్స్.
Published by: Ramu Chinthakindhi
First published: May 2, 2019, 5:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading