హోమ్ /వార్తలు /క్రీడలు /

Robin Uthappa : బలవంతంగా సంతకాలు తీసుకుని ముంబై జట్టు నుంచి సాగనంపారు.. ఊతప్ప షాకింగ్ కామెంట్స్..

Robin Uthappa : బలవంతంగా సంతకాలు తీసుకుని ముంబై జట్టు నుంచి సాగనంపారు.. ఊతప్ప షాకింగ్ కామెంట్స్..

Robin Uthappa : ఐపీఎల్ కెరీర్‌లో 196 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 26 హాఫ్ సెంచరీలతో 4813 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు ఊతప్ప.

Robin Uthappa : ఐపీఎల్ కెరీర్‌లో 196 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 26 హాఫ్ సెంచరీలతో 4813 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు ఊతప్ప.

Robin Uthappa : ఐపీఎల్ కెరీర్‌లో 196 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 26 హాఫ్ సెంచరీలతో 4813 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు ఊతప్ప.

  ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ హోరాహోరీగా సాగుతుంది. ప్రతి మ్యాచ్ ఆఖరి వరకూ జరుగుతుండటంతో అభిమానులకు కావాల్సినంత కిక్ వస్తోంది. ఐపీఎల్ లో సూపర్ రికార్డులు ఉన్న చెన్నై, ముంబై విజయాలు దక్కించుకోవడానికి నానా తంటాలు పడుతుంటే.. కొత్తగా వచ్చిన లక్నో, గుజరాత్ జట్లతో పాటు కేకేఆర్ టీమ్ దుమ్మురేపుతోంది. ఇక, నాలుగు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) పరిస్థితి దారుణంగా మారింది. ఆ జట్టులో సరిగ్గా రాణించే బ్యాటరే కరువయ్యాడు. కాస్తా కూస్తో.. శివమ్ దూబే, ధోని మెరుపులు మెరిపిస్తున్నారు. ఇక, లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో రాబిన్ ఊతప్ప (Robin Uthappa) అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచులో కేవలం 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఊతప్ప. అయినా, బౌలర్ల వైఫల్యంతో మ్యాచ్ చేజార్చుకుంది. అయితే, రాబిన్ ఊతప్ప లేటెస్ట్ గా షాకింగ్ కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయ్.

  ఐపీఎల్ 2008 సీజన్ నుంచి అన్నీ సీజన్లలో ఆడుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ ఆడిన ఊతప్ప, ఆ తర్వాత ఆర్‌సీబీ, పూణే వారియర్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్నాడు.ఐపీఎల్ కెరీర్‌లో 196 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 26 హాఫ్ సెంచరీలతో 4813 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు ఊతప్ప.

  అయితే, మొదటి సీజన్ ముంబై ఇండియన్స్ కు ఆడాడు ఊతప్ప. అయితే, ఆ సీజన్ తర్వాత ముంబై నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ట్రాన్స్ ఫర్ అయిన ముగ్గుర ఆటగాళ్లలో రాబిన్ ఊతప్ప కూడా ఉన్నాడు. అయితే, ఈ ట్రాన్సఫర్ పై రాబిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  ఇది కూడా చదవండి : అందుకే కదా నిన్ను సర్ జడేజా అనేది.. ఏమన్నా టాలెంటా.. వైరలవుతున్న వీడియో..

  "ఐపీఎల్‌లో టీమ్ ట్రాన్స్‌ఫర్ అయిన మొదటి ప్లేయర్లలో నేను ఒకడిని. నేను, జహీర్ ఖాన్, మనీశ్ పాండే కలిసి ముంబై ఇండియన్స్‌లో ఉన్నాడు. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ తరుపున ఆడాలని మెంటల్‌గా కట్టుబడిపోయా. అయితే ఐపీఎల్ అయ్యాక నెలరోజులకే టీమ్ మారాలని చెప్పారు. ట్రాన్స్‌ఫర్ పేపర్లపై సంతకం చేసేందుకు నేను ఒప్పుకోలేదు.ముంబై ఇండియన్స్‌లో ఓ వ్యక్తి, ట్రాన్స్‌ఫర్ పేపర్లపై సంతకం చేయకపోతే, టీమ్‌లో చోటు ఉండదని భయపెట్టాడు. బలవంతంగా నాతో సంతకాలు చేయించాడు.

  నా పర్సనల్ లైఫ్‌లోనూ ఆ సమయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ కారణంగా ఆర్‌సీబీతో ఆడిన మొదటి సీజన్‌లో తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నా. ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా బాగా ఆడలేకపోయా. నన్ను తప్పించి, మళ్లీ ఆడించిన మ్యాచ్‌లో మాత్రం రాణించగలిగాను..." అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు రాబిన్ ఊతప్ప.

  ఇది కూడా చదవండి : రిషబ్ పంత్ కావాలనే తెలుగు ప్లేయర్ ని తొక్కేస్తున్నాడా..? భవిష్యత్తులో పోటీ వస్తాడని సైడ్ చేశాడా..?

  ఐపీఎల్ 2008 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 14 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 35.55 సగటుతో 320 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 48 పరుగులు. అయితే, రాబిన్ ఊతప్పకి గుర్తింపు వచ్చింది మాత్రం కోల్ కతా టీమ్ లోనే. కోల్ కతా తరఫున ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు ఊతప్ప.

  First published:

  Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, Mumbai Indians, Royal Challengers Bangalore

  ఉత్తమ కథలు