IPL 2021: ముంబైపై బ్యాటుతో రెచ్చిపోయిన రుతురాజ్ గైక్వాడ్.. ఐపీఎల్‌లో రుతురాజ్ సరికొత్త రికార్డు..

సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు (PC: IPL)

IPL 2021: ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున అరుదైన రికార్డు సృష్టించాడు.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా దుబాయ్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్  (Ruturaj Gaikwad) (88 నాటౌట్) బ్యాటుతో రెచ్చిపోయాడు. 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి, అంబటి రాయుడు రిటైర్డ్ హర్ట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో ఓపెనర్ రుతురాజ్ సమయోచితంగా ఆడాడు. ఒక వైపు వికెట్లు వరుసగా పడుతున్నా.. ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా క్లాసీ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్‌గా వచ్చి ఇన్నింగ్ ముగిసే వరకు క్రీజులు పాతుకొని పోయాడు. 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సహాయంతో రుతురాజ్ 88 పరుగులు చేశాడు. దీంతో చెన్నై జట్టు 157 పరుగల లక్ష్యాన్ని ముంబై ఎదుట ఉంచింది.

    ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ ఒక రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై జట్టుపై అత్యధిక పరుగులు చేసిన సీఎస్కే బ్యాట్స్‌మాన్‌గా నిలిచాడు. గైక్వాడ్ 88 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో మైకెల్ హస్సీ (86 నాటౌట్), సురేష్ రైనా (83 నాటౌట్) ఉన్నారు. హస్సీ 2013లో, రైనా 2010లో ఈ స్కోర్లు సాధించారు. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రుతురాజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను చాలా అలసిపోయారు. అయితే నా ఇన్నింగ్స్ పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను జట్టు ఏ పని చేయాలో అదే చేశాను. త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు.. ఆ ఒత్తిడిని అధిగమించి ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది. నేను అదే పని చేశానని రుతురాజ్ చెప్పాడు. ఈ రోజు ఆడిన పిచ్ చాలా వైవిధ్యంగా ఉన్నది. పేసర్లకే కాకుండా స్పిన్నర్లకు కూడా సహకరిస్తున్నదని చెప్పాడు.







    ఇక రుతురాజ్ ఈ సీజన్‌లో మొత్తం 284 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2021లో రుతురాజ్ గైక్వాడ్ 40.57 సగటుతో ఈ పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు కూడా ఉన్నాయి.
    Published by:John Naveen Kora
    First published: