• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • CHENNAI SUPER KINGS DECIDE TO RELEASE KEDAR JADHAV AHEAD OF IPL 2021 AUCTION SRD

IPL 2021 : 7.8 కోట్ల రూపాయల కేదార్ జాదవ్ ని వదిలించుకోవడానికి రెడీ అయిన చెన్నై

IPL 2021 : 7.8 కోట్ల రూపాయల కేదార్ జాదవ్ ని వదిలించుకోవడానికి రెడీ అయిన చెన్నై

Kedar Jadhav

IPL 2021 : ఐపీఎల్ 2021 సీజన్ లో కేదార్ జాదవ్ ను వదిలించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అయింది. ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్ 2021 సీజన్ కి సంబంధించిన మినీ వేలం జరిసే సూచనలు కన్పిస్తున్నాయ్. దీంతో జనవరి 21 లోపు రిటైన్ చేసుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే ప్లేయర్ల లిస్ట్ ను సమర్పించాలని అన్ని ఫ్రాంచైజీల్ని బీసీసీఐ ఆదేశించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి కేదార్ జాదవ్ ని విడిచి పెట్టడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయ్.

  • Share this:
    ఐపీఎల్ 2021 సీజన్ లో కేదార్ జాదవ్ ను వదిలించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అయింది. ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్ 2021 సీజన్ కి సంబంధించిన మినీ వేలం జరిసే సూచనలు కన్పిస్తున్నాయ్. దీంతో జనవరి 21 లోపు రిటైన్ చేసుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే ప్లేయర్ల లిస్ట్ ను సమర్పించాలని అన్ని ఫ్రాంచైజీల్ని బీసీసీఐ ఆదేశించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి కేదార్ జాదవ్ ని విడిచి పెట్టడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయ్. ఐపీఎల్ 2020 సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన కేదార్ జాదవ్ కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు. ఈ 8 మ్యాచ్‌ల్లో కలిపి కనీసం ఒక్క సిక్స్‌ కూడా కేదార్ జాదవ్ కొట్టలేదు. దీంతో కేదార్ ను విడిచిపెట్టడానికి చెన్నై ఫ్రాంచైజీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2018 సీజన్ మెగా వేలంలో రూ. 7.8 కోట్లకి కేదార్ జాదవ్‌ని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే 24 పరుగులతో చెన్నై టీమ్‌ని గెలిపించిన కేదార్ జాదవ్.. ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.

    ఇక ఐపీఎల్ 2019 సీజన్‌లో మొత్తంగా 162 పరుగులు మాత్రమే చేసిన జాదవ్.. ప్లేఆఫ్ మ్యాచ్‌లకి గాయంతో దూరమయ్యాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో కెప్టెన్ ధోనీ వరుసగా అవకాశాలిచ్చినా.. అతను వినియోగించుకోలేకపోయాడు. దీంతో.. ఆఖర్లో ఓ ఆరు మ్యాచ్‌ల్లో అతనిపై వేటు పడింది. మొత్తంగా పేలవ ఫామ్, ఫిట్‌నెస్‌లేమి నిరాశపరుస్తున్న కేదార్ జాదవ్‌ని వేలంలోకి విడిచిపెట్టేందుకు ఫ్రాంఛైజీలోని సభ్యులందరూ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

    కేదార్ జాదవ్‌తో పాటు పీయూస్ చావ్లా, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, సురేశ్ రైనాలను కూడా వేలంలోకి విడిచిపెట్టడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్‌ నుంచి ఆరంభంలోనే వ్యక్తిగత కారణాలతో రైనా, హర్భజన్ సింగ్ తప్పుకున్నారు. అప్పట్లో రైనాకి, చెన్నై ఫ్రాంచైజీకి మధ్య వివాదాలు చెలరేగాయ్. చెన్నై సూపర్ కింగ్స్ పేజీ నుంచి రైనా కూడా అన్ ఫాలో అవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
    Published by:Sridhar Reddy
    First published: