రజనీకాంత్‌ను కలవాలని ఉంది.. ధోనికి గిఫ్ట్ ఇస్తానంటున్న స్టార్ క్రికెటర్..

ప్రస్తుతం తమిళం నేర్చుకునే పనిలో ఉన్నానని, త్వరలోనే ఆ భాషను అవపోపన పట్టేస్తానని చెప్పుకొచ్చాడు. సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు.

news18-telugu
Updated: May 6, 2019, 4:28 PM IST
రజనీకాంత్‌ను కలవాలని ఉంది.. ధోనికి గిఫ్ట్ ఇస్తానంటున్న స్టార్ క్రికెటర్..
డ్వేన్ బ్రావో (ఫైల్)
  • Share this:
వేర్వేరు దేశాలు, సంస్కృతులు, మనస్తత్వాలు, వ్యక్తిత్వాలను, ఐపీఎల్ ఒక్క చోటుకు తెచ్చింది. ముఖ్యంగా క్రికెటర్ల మధ్య బంధాన్ని పెంచింది. స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించింది. శత్రువులను మిత్రులుగా మార్చింది. అలా భారత్‌పై మమకారం పెంచుకున్న విదేశీ క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. తమ దేశం తరఫున ఆడుతూ భారత్‌పై పరుగుల వరద పారించినా అభిమానులు వారిపై ద్వేషం పెంచుకోరు సరికదా.. ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లు ఆ క్రికెటర్లు కూడా భారత అభిమానులు అంటే పడి చస్తారు. అలా భారతీయ అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్.. డ్వేన్ బ్రావో. అది మ్యాచ్ అయినా, బయట అయినా.. బ్రావోలో ఉండే ఉత్తేజమే వేరు. వికెట్ తీశాక, సిక్సర్ బాదాక, క్యాచ్ పట్టాక  డ్వేన్ చేసుకునే సంబరాలకు అభిమానులు వంతు పాడతారు. క్రికెట్‌లో మాత్రమే కాదు బయట కూడా ఇతగాడు ఆల్‌రౌండరే. సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, పాటలు, నటన.. ఇలా ప్రతీ దానిలో తన మార్కును చూపిస్తాడు.

ప్రస్తుతం తమిళం నేర్చుకునే పనిలో ఉన్నానని, త్వరలోనే ఆ భాషను అవపోపన పట్టేస్తానని చెప్పుకొచ్చాడు. సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. మరి భారత్‌లో సినీ నటుల్లో ఎవరైనా తెలుసా అని ప్రశ్నించగా రజనీకాంత్‌ గురించి విన్నానని, అయితే ఆయన సినిమాలు చూసే అవకాశం రాలేదని వెల్లడించాడు. ఏదో ఒక రోజు ఆయన్ను తప్పకుండా కలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక, ధోని ఏవైనా సూచనలు ఇచ్చారా? అని అడగ్గా.. వైఫల్యాలను చూసి భయపడవద్దని ఎప్పుడూ చెబుతుంటాడని పేర్కొన్నాడు. 2020 ఐపీఎల్‌లో ఒక ప్రత్యేక పాట పాడి ధోనికి గిఫ్ట్ ఇస్తానని బ్రావో తెలిపాడు.

First published: May 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు