Home /News /sports /

CHECK THIS RARE INDECENT IN TEST CRICKET ENGLAND PLAYED 2 TEST MATCHES AT THE SAME TIME JNK

Test Cricket: ఒకే సమయంలో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్!! ఎప్పుడు? ఎక్కడ? ఈ అరుదైన రికార్డు నమోదయ్యింది!!

ఇకే టైంలో రెండు టెస్టులు ఆడిన ఇంగ్లాండ్.. ఎప్పుడు? ఎక్కడ?

ఇకే టైంలో రెండు టెస్టులు ఆడిన ఇంగ్లాండ్.. ఎప్పుడు? ఎక్కడ?

England Test Team: ఇంగ్లాండ్ జట్టుకు ఒక అరుదైన టెస్టు రికార్డు ఉన్నది. ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు దేశాలతో టెస్టు మ్యాచ్‌లుఆడింది. 91 ఏళ్ల క్రితం జరిగిన ఈ అరుదైన ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

    ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన క్రికెట్ (Cricket) ఆటకు ఇంగ్లాండ్ (England) పుట్టినిల్లు. అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఎక్కువగా ఇంగ్లాండ్‌లోనే జరిగేవి. ఇక విదేశీ పర్యటనల సంస్కృతిని కూడా ఇంగ్లాండే ప్రారంభించింది. అప్పట్లో ఎక్కువగా టెస్టు మ్యాచ్‌లే ఆడేవాళ్లు. ఇప్పుడు కూడా అనేక జట్లు ఇతర దేశాలకు వెళ్లి క్రికెట్ ఆడుతున్నాయి. అయితే ఒకే సమయంలో ఒకే దేశానికి చెందిన జట్లు వేర్వేరు దేశాల్లో క్రికెట్ ఆడటం గమనిస్తూనే ఉన్నాము. ఇటీవల ఇండియా జట్టు (Team India) ఇంగ్లాండ్‌కు వెళ్లి టెస్టు సిరీస్ ఆడింది. అదే సమయంలో మరో జట్టు శ్రీలంక (Srilanka) వెళ్లి పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడింది. అయితే 91 ఏళ్ల క్రితం ఒకే దేశానికి చెందిన రెండు జట్లు వేర్వేరు దేశాల్లో టెస్ట్ సిరీస్ (Test Series) ఆడింది. అది కూడా ఒకే సమయంలో ఆ టెస్టు మ్యాచ్‌లు జరగడం విశేషం. క్రికెట్ చరిత్రలో అలా ఒకే సారి ఒక దేశం వేర్వేరు ప్రాంతాల్లో టెస్టులు ఆడటం అరుదైన విషయంగా నిలిచిపోయింది. ఆ ఆసక్తికరమైన సంఘటనకు ఇంగ్లాండ్ జట్టే తెరలేపింది.

    1930 జనవరి 10 నుంచి 13 వరకు క్రైస్ట్ చర్చ్‌ వేదికగా ఇంగ్లాండ్ - న్యూజీలాండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. న్యూజీలాండ్ జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. న్యూజీలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక హెరాల్డ్ గిల్లిగాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యత లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ జట్టు 131 పరుగులు చేసింది. 63 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకున్నది. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు 8 వికెట్ల విజయం వరించింది.

    Hardik Pandya: టెస్టులకు హార్దిక్ పాండ్యా గుడ్ బై? సుదీర్ఘ ఫార్మాట్ వదిలేయడానికి అసలు కారణం ఇదే


    మరోవైపు ఇంగ్లాండ్ జట్టు మరో 11 మందితో కలసి అదే సమయంలో వెస్టిండీస్‌లో టెస్టు మ్యాచ్ ఆడింది. 1930 జనవరి 11 నుంచి టెస్టు మ్యాచ్ ఆడింది. వెస్టిండీస్‌తో జరిగిన ఈ టెస్టును ఇంగ్లాండ్ జట్టు డ్రాగా ముగించింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 467 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు 384 పరుగులు చేసింది. 287 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 167 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. చివరి రోజు ఇంగ్లాండ్ పూర్తిగా డిఫెన్స్ ఆడి మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అయితే ఒకే సమయంలో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడి ఇంగ్లాండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు మరోసారి ఇలాంటి ఘటన జరుగలేదు.

    Anna Kournikova: ఈ టెన్నిస్ తార వయసు 40 ఏళ్లంటే నమ్మగలమా? సెక్సీ ఔట్‌ఫిట్‌లో అన్నా కౌర్నికోవా


    టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక టెస్టులు ఆడిన జట్టుగా ఇంగ్లాండ్ పేరిట రికార్డు ఉన్నది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ జట్టు 1040 టెస్టులు ఆడింది. మరోవైపు 1000కి పైగా టెస్టులు ఆడిన ఏకైక జట్టు కూడా ఇంగ్లాండే. ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 378 మ్యాచ్‌లలో గెలిచి 311 మ్యాచ్‌లు ఓడిపోయింది. మరో 351 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక ఆస్ట్రేలియా జట్టు 834 టెస్టులతో రెండో స్థానంలో నిలిచింది. 394 టెస్టులు గెలిచి, 226 టెస్టుల్లో ఓడిపోయింది. 212 మ్యాచ్‌లు డ్రా కాగా, 2 మ్యాచ్‌లు టైగా మారాయి, టీమ్ ఇండియా 557 టెస్టులు ఆడి నాలుగో స్థానంలో ఉన్నది. వీటిలో 165 విజయాలు, 171 ఓటములు ఉన్నాయి. ఒక మ్యాచ్ టై కాగా, 220 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: England vs newzealand, ICC, Test Cricket

    తదుపరి వార్తలు