పెటర్నిటీ లీవ్ పెడుతున్న సెలబ్రిటీ డ్యాడ్స్ (Celebrity dads) సంఖ్య క్రమంగా ఊపందుకుంటోంది. తాము తండ్రులు కాబోయే సమయంలో, బిజీ షెడ్యూల్ నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నారు. తండ్రి బాధ్యతలు పూర్తిచేసేందుకు సెలబ్రిటీ డ్యాడ్స్ తమ భార్యలకు ఈసమయంలో అండగా ఉంటున్నారు. ఎమోషనల్ గా, మానసికంగా తమ అర్ధాంగికి అండగా నిలిచేందుకు వీరు తాపత్రయపడుతుండటం విశేషం. ఒకరకంగా ఇది లగ్జురీ ఆప్షన్ గా భావిస్తున్నారుకూడా. తల్లిగా మారేక్రమంలో భార్యకు ఉన్న ఒత్తిడిని పంచుకుని, తల్లి, బిడ్డల బాగోగులు స్వయంగా చూసుకునేందుకు పెటర్నల్ లీవ్ తీసుకునే నటులు, క్రీడాకారులు మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మొదటి డెలివరీ సమయంలోనే కాదు రెండవ డెలివరీ సమయంలోనూ వీరు పెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నారంటే ఇది మన సొసైటీపై ప్రభావం చూపడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. రొటీన్లో పడి వైవాహిక జీవితానికి, కుటుంబ సభ్యులకు కీలక సమయంలో టైం కేటాయిస్తూ, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చే సెలబ్రిటీలు ఫ్యామిలీ మెన్ అనిపించుకోవటం హైలైట్.
తల్లిదండ్రులుగా ప్రయాణం మొదలుపెట్టే సమయంలో భార్యకు అండదండగా భర్త నిలవటం చాలా మంచి పరిణామం. ఇది కుటుంబ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా, బాధ్యతను చాటుకునేలా, బంధాలు మరింత పెనవేసుకునేలా చేస్తుంది. ఇలా పేరెంట్హుడ్ ను ఎంజాయ్ చేస్తున్న సెలబ్రిటీ తండ్రుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
విరాట్ కోహ్లి
ఇండియన్ క్రికకెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) పెటర్నల్ లీవ్ లో ఉన్నారు. తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ వచ్చే నెలలో డెలివరీ కానుండగా ఆమెకు అండగా ఉంటూ, ఈ స్పెషల్ అకేషన్ లో అనుష్క చెయ్యి పట్టుకుని తోడుగా ఉండేందుకు పెటర్నిటీ లీవ్ పెట్టడం విశేషం. విరాట్ కోహ్లి పెటర్నిటీ లీవ్ పెట్టినట్టు బీసీసీఐ నిర్ధారించింది కూడా. తమ తొలి బిడ్డను విరుష్కలు స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.
సైఫ్ అలీ ఖాన్
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కూడా పెటర్నిటీ లీవ్ లో ఉన్నారు. తన భార్య, బాలీవుడ్ సూపర్ స్టార్ కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor) నిండు చూలాలుగా ఉండగా, త్వరలో పుట్టబోయే బిడ్డ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న సైఫీనాలు ఇప్పటికే ఒక మగ బిడ్డకు తల్లిదండ్రులు కూడా. తన బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకున్న సైఫ్ పెటర్నిటీ లీవ్ తో మరోసారి తన తండ్రి మనసును చాటుకుంటున్నారు.
షాహిద్ కపూర్
మరో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా గతంలో ఇలాగే పెటర్నిటీ లీవ్ తీసుకుని తన అర్ధాంగి మీరా రాజ్ పుట్ కు తోడు నీడగా ఉన్నారు. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన షాహిద్-మీరాలు తల్లిదండ్రులుగా తమ పాత్రను చక్కగా పోషిస్తూ అభిమానుల మన్ననలు తరచూ ఇంటర్నెట్ వేదికగా అందుకుంటూ ఉంటారు. ఇద్దరు బిడ్డలకు తన సతీమణి జన్మనిచ్చే సమయంలో షాహిద్ ఇలాగే పెటర్నిటీ లీవ్ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరచారు.
కునాల్ ఖేము
సోహా అలీ ఖాన్ ను వివాహం చేసుకున్న బాలీవుడ్ నటుడు కునాల్ ఖేము కూడా పెటర్నిటీ లీవ్ తీసుకున్న సెలబ్రిటీ డ్యాడ్స్ లో ఒకరు. సోహా-కునాల్ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఇనయా జన్మించే సమయంలో ఈయన పెటర్నల్ లీవ్ లో ఉంటూ సోహా పక్కనే ఉంటూ అన్నీ తానై చూసుకున్నారు.
మార్క్ జూకర్బర్గ్
ఫేస్ బుక్ (Facebook) సీఈఓ మార్క్ జూకర్బర్గ్ (Mark Zuckerberg) 2 నెలలపాటు పెటర్నిటీ బ్రేక్ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరచారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు.
అలెక్సిస్ ఒహానియన్
సోషల్ న్యూస్ వెబ్సైట్ Reddit సహవ్యవస్థాపకుడు, ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్ అయిన అలెక్సిస్ 16 వారాల పెటర్నిటీ లీవ్ తీసుకున్నారు. తన సతీమణి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి అయిన సెరీనా విలియమ్స్ ప్రసవం సమయంలో ఈయన ఇలా సెలవు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరచారు. ముందు 6 వారాల సెలవు తీసుకుని ఆతరువాత దాన్ని 16 వారాలకు పొడగించుకున్నారు అలెక్సిస్.
ప్రిన్స్ విలియమ్
ఈ లిస్ట్ లో బ్రిటన్ రాజకుటుంబ సభ్యుడైన ప్రిన్స్ విలియమ్ కూడా చోటు సంపాదించారు. తన ముగ్గురు పిల్లల డెలివరీ సమయంలో ఆయన పెటర్నిటీ లీవ్ తీసుకున్నారు.
డేనియల్ మర్ఫీ
మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ డేనియల్ మర్ఫీ తన తొలి సంతానం కోసం ఇలా పెటర్నిటీ లీవ్ తీసుకున్నారు.
కరణ్ జోహర్
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ (Karan Johar) సింగిల్ డ్యాడ్ గా ఉంటూనే పెటర్నిటీ లీవ్ తీసుకున్నారు. రూహి, యష్ అనే కవల పిల్లలకు అద్దెగర్భం (surrogacy)ద్వారా తండ్రైన కరణ్..వారి కోసం 2 నెలల పెటర్నిటీ బ్రేక్ తీసుకున్నారు.
రితేష్ దేశ్ ముఖ్
తన సతీమణి ప్రముఖ నటి జెనీలియా ప్రసవించే సమయంలో ప్రముఖ్ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ పెటర్నిటీ లీవ్ తీసుకున్నారు.
వివేక్ ఒబెరాయ్
తన సతీమణి ప్రియాంక ప్రసవించే సమయంలో నటన నుంచి బ్రేక్ తీసుకున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ఇందుకోసం ముందుగానే తన షూటింగ్స్ ను ఈయన పూర్తి చేసుకునిమరీ సెలవులు వెళ్లారట.
రాజ్ కుంద్రా
నటి శిల్పా షెట్టీని వివాహం చేసుకున్న బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా తన బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకుని శిల్పా డెలివరీ టైంలో వెన్నంటి ఉన్నారు. ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడపటం తన తొలి ప్రాధాన్యత అనే రాజ్.. పెటర్నిటీ లీవ్ తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Saif Ali Khan, Shahid Kapoor, Virat kohli