విరాట్‌ కోహ్లీని ముద్దాడిన బామ్మ ఇక లేరు..

87 ఏళ్ల వయస్సున్న చారులత ఈ నెల 13న చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇంగ్లాండ్ వేదికగా టీమిండియా ప్రపంచకప్‌ మ్యాచ్ చక్రాల కుర్చీలో వచ్చి టీమిండియా మ్యాచ్ చూశారు. అంతేకాదు ఆమె స్టేడియంలో బూర ఊదుతూ సందడి చేశారు.

news18-telugu
Updated: January 16, 2020, 2:15 PM IST
విరాట్‌ కోహ్లీని ముద్దాడిన బామ్మ ఇక లేరు..
క్రికెట్ సూపర్ ఫ్యాన్ చారులత ఇకలేరు
  • Share this:
టీమిండియా ‘సూపర్‌ ఫ్యాన్‌’ చారులత కన్నుమూశారు. 87 ఏళ్ల వయస్సున్న చారులత ఈ నెల 13న చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇంగ్లాండ్ వేదికగా టీమిండియా ప్రపంచకప్‌ మ్యాచ్ చక్రాల కుర్చీలో వచ్చి టీమిండియా మ్యాచ్ చూశారు. అంతేకాదు ఆమె స్టేడియంలో బూర ఊదుతూ సందడి చేశారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్లో ఆమె సందడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆమెను కలిశారు. ఆప్యాయంగా పలకరించి ఆమె ఆశీర్వదించారు. మిగతా మ్యాచులు చూసేందుకు టికెట్లు కొనిస్తానని కోహ్లీ హామీనిచ్చారు. ఇదంతా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే ఆ బామ్మ జనవరి 13, సాయంత్రం 5:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అంతేకాదు బీసీసీఐ సైతం చారులత మరణం గురించి తెలిసి సంతాపం వ్యక్తం చేసింది.First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు