Home /News /sports /

CHAIRMAN OF THE SELECTION COMMITTEE CHETAN SHARMA HAS ALSO OPENED UP ABOUT THE ODI CAPTAINCY OF VIRAT KOHLI PRV

Kohli captaincy: కోహ్లీ కెప్టెన్సీ రగడపై స్పందించిన చీఫ్​ సెలెక్టర్​ చేతన్​ శర్మ..  ఆ రోజు జట్టు సమావేశంలో ఏం జరిగిందో చెప్పిన చేతన్..

Virat Kohli

Virat Kohli

విరాట్ కోహ్లీకి సంబంధించిన వన్డే కెప్టెన్సీపై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ (Chairman of the selection committee Chetan Sharma) కూడా వివాదానికి తెరతీశారు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని కోహ్లీని సెలక్షన్ కమిటీ కోరిందని శర్మ చెప్పాడు.

ఇంకా చదవండి ...
    దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైన తర్వాత సెలక్షన్ కమిటీ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించింది. విరాట్ కోహ్లీకి సంబంధించిన వన్డే కెప్టెన్సీపై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ (Chairman of the selection committee Chetan Sharma) కూడా వివాదానికి తెరతీశారు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని కోహ్లీని సెలక్షన్ కమిటీ కోరిందని శర్మ చెప్పాడు.

    ‘‘ప్రపంచకప్‌ (World cup)కు ముందు సమావేశం ప్రారంభం కాగానే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ ఉన్న వారంతా పునరాలోచించుకోవాలని చెప్పారు. సెలెక్టర్లందరూ ప్రపంచకప్‌పై ప్రభావం చూపుతుందని భావించారు. కన్వీనర్లు, బోర్డు అధికారులు అంతా భారత క్రికెట్‌ (Cricket) కోసం కొనసాగాలని విరాట్‌కు చెప్పారు. అయితే విరాట్​ నిర్ణయం మాత్రం అందరినీ షాక్‌కి గురిచేసింది. వరల్డ్‌కప్ తర్వాత మేం మాట్లాడాలనుకుంటున్నాం" అని శర్మ చెప్పాడు.

    “సెలెక్టర్ల నుంచి (BCCI) ఆఫీస్ బేరర్లు, సెలక్షన్ మీటింగ్ కన్వీనర్ హాజరైన అందరూ కోహ్లికి ప్రపంచకప్ ముగిసే వరకు టీ 20 కెప్టెన్సీ లో కొనసాగాలని  చెప్పారు. టీ20 కెప్టెన్సీని వదులుకుంటానని విరాట్ ప్రకటించినప్పుడు మేం ప్రపంచకప్ మధ్యలో ఉన్నాం. బోర్డు సభ్యులందరూ పునరాలోచించమని అడిగారు" అన్నారాయన.

    ఆ సమయంలో విరాట్​ కోహ్లీ చెప్పినపుడు అందరూ ప్రపంచకప్ తర్వాత పునరాలోచించవచ్చని చెప్పారని చేతన్​ తెలిపారు. భారత జట్టును అగ్రస్థానంలో నిలపడమే మా లక్ష్యమని, మాకు వివాదాలు వద్దని, అత్యుత్తమ వ్యక్తులు దేశం కోసం ఆడేలా చూసుకోవాలి అన్నాడు.

    ఊహాగానాలు వద్దు..

    ‘‘కోహ్లి, రోహిత్‌ల మధ్య విభేదాలు తలెత్తాయనే ఊహాగానాలపై చీఫ్‌ సెలక్టర్‌ని ప్రశ్నించగా ఊహాగానాలు చేయవద్దు. నేను 20 ఏళ్లుగా మీడియాలో భాగమయ్యాను. ఊహాగానాలకు నవ్వుకుంటాను. వారంతా ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తున్నారు."

    భారత​ క్రికెట్​ జట్టు (Team India)లో మరో కొత్త కెప్టెన్ (New captain)​ వచ్చాడు. కోహ్లీ, రోహిత్​ శర్మల మధ్య ఇన్నాళ్లుగా కెప్టెన్​ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రోహిత్​ శర్మ (Rohit Sharma)ను టీ20, వన్డేలకు కెప్టెన్​ చేశారు సెలక్టర్లు. అయితే అనూహ్య పరిస్థితులు ఎదురవడంతో కొత్త కెప్టెన్​ వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul) భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహిత్ శర్మకు గాయం కావడంతో (Injury) సిరీస్​కు అందుబాటులో లేడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. శుక్రవారం 18 మందితో కూడిన భారత జట్టు (Team India)ను సెలక్టర్లు ప్రకటించారు.

    భారత వన్డే జట్టు: కేఎల్​ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికె), వై చాహల్, ఆర్ అశ్విన్, డబ్ల్యూ సుందర్, జె బుమ్రా (విసి), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Cricket, Virat kohli

    తదుపరి వార్తలు