హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : అల్లరి పిల్లాడు మళ్లీ యేసేశాడుగా.. చాహల్ ఫన్నీ సెటైర్ కి సిరాజ్ సీరియస్..

Viral Video : అల్లరి పిల్లాడు మళ్లీ యేసేశాడుగా.. చాహల్ ఫన్నీ సెటైర్ కి సిరాజ్ సీరియస్..

Viral Video : యూజీకి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ కూడా ఉంది. అందులో టీమిండియా ఆటగాళ్లను ఇంటర్వ్యూ కూడా చేస్తుంటాడు. ఆ సమయంలో చాలా ఫన్ క్రియేట్ చేస్తాడు.

Viral Video : యూజీకి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ కూడా ఉంది. అందులో టీమిండియా ఆటగాళ్లను ఇంటర్వ్యూ కూడా చేస్తుంటాడు. ఆ సమయంలో చాలా ఫన్ క్రియేట్ చేస్తాడు.

Viral Video : యూజీకి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ కూడా ఉంది. అందులో టీమిండియా ఆటగాళ్లను ఇంటర్వ్యూ కూడా చేస్తుంటాడు. ఆ సమయంలో చాలా ఫన్ క్రియేట్ చేస్తాడు.

  టీమిండియా(Team India) మణికట్టు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్పిన్ మాయాజాలంతో పాటు చిలిపితనం కూడా మనోడికి బాగానే ఉంటుంది. మ్యాచ్ జరుగుతుండగానే సహచరులను తన పనులతో ఆటపట్టిస్తుంటాడు. యూజీకి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ కూడా ఉంది. అందులో టీమిండియా ఆటగాళ్లను ఇంటర్వ్యూ కూడా చేస్తుంటాడు. ఆ సమయంలో చాలా ఫన్ క్రియేట్ చేస్తాడు. ఇక, ఏదైనా మ్యాచ్ లో భారత్ విజయం సాధించగానే.. చాహల్ మైక్ పట్టుకొని వచ్చి హంగామా చేస్తూ ఉంటాడు. ఎవరినో ఒకరిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. లేటెస్ట్ గా కూడా ఈ చిలిపి పిల్లాడు చేసిన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.

  వివరాల్లోకెళితే.. రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా 12 మ్యాచుల్లో గెలిచిన రోహిత్ సేన, శ్రీలంకతో మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం ఎదురుచూస్తోంది. మూడో టీ20లో ఆరు వికెట్ల తేడా టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇంకేముంది.. చిలిపి పిల్లాడు చాహల్.. మరోసారి తన స్టైల్ లో అల్లరి చేశాడు.

  మూడు టీ20 మ్యాచుల్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచిన శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer)ను ఇంటర్వ్యూ చేసిన యుజ్వేంద్ర చాహాల్, తర్వాత అక్కడికి వచ్చిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌ (Mohammad Siraj)పై వ్యంగ్యస్త్రాలు సంధించాడు.

  ఇది కూడా చదవండి : ఆడు మగాడ్రా బుజ్జి.. లంక బౌలర్లు అసలు ఔటే చేయలేకపోయారు.. రికార్డుల మోతే..

  " వెల్ కమ్ సిరాజ్... చూడండి అతని జుట్టు... ఎవ్వరూ నీళ్లు పోయక ఎండిపోయిన గడ్డిలా ఎలా తయారయ్యిందో... గడ్డి పూర్తిగా ఎండిపోయింది..." అంటూ కామెంట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్. చాహాల్ కామెంట్‌కి సిరాజ్‌ సీరియస్ గా చూస్తూ ఉండిపోతే, పక్కనే ఉన్న శ్రేయస్ అయ్యర్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. ఆ తర్వాత సిరాజ్ కూడా చాహల్ అల్లరి నవ్వేశాడు.

  ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మొదటి రెండు టీ20ల్లో చోటు దక్కించుకోలేకపోయిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్,. ఆఖరి టీ20 మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చి అదిరిపోయే స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. ఓ వికెట్ తీసిన మియా బాయ్ 4 ఓవర్లలో కేవలం 22 పరుగుల మాత్రేమే ఇచ్చాడు. మొత్తానికి టీమిండియా అదిరిపోయే విజయాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

  First published:

  Tags: India vs srilanka, Mohammed Siraj, Shreyas Iyer, Team India, Viral Video

  ఉత్తమ కథలు