Tokyo Olympics: ఒలింపిక్స్ టీవీలో చూస్తున్న పిల్లి.. జిమ్నాస్ట్ పడిపోతుందేమో అనే కంగారు.. చూడండి వింత చేష్టలు

ఈ పిల్లి విన్యాసాలు చూస్తే నవ్వు ఆపకోకుండా ఉండలేరు (PC: Humor and Animals)

టోక్యో ఒలింపిక్స్ చూస్తున్న పిల్లి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అది చేస్తున్న విన్యాసాలు చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు.

  • Share this:
    ప్రస్తుతం ఎక్కడ చూసినా టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) సంబంధించిన విశేషాలే ముచ్చటించుకుంటున్నారు. క్రీడా ప్రపంచంలో నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ మెగా ఈవెంట్ ఈ సారి ఏడాది ఆలస్యంగా జరిగింది. కరోనా సమయంలో ప్రపంచమంతా స్తబ్దుగా ఉండగా.. ఈ విశ్వక్రీడలు కాస్త ఊరటనిస్తున్నాయి. 200పైగా దేశాలకు చెందిన 10 వేల మందికి పైగా క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఇక ఈ ఒలింపిక్స్‌కు సంబంధించి అనేక వార్తలు, విచిత్రాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో అన్నింటి కంటే ఒక పిల్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ పిల్లి చేష్టలు అందరికీ నవ్వు తెప్పించడమే కాదు.. దాని దయాగుణానికి ఆశ్చర్యపోతున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఒక జిమ్నాస్ట్ విన్యాసాలు చేస్తుండగా పిల్లి టీవీ దగ్గర కూర్చొని చూస్తున్నది. ముందు ఒక పురుష జిమ్నాస్ట్ కడ్డీని పట్టుకొని వేలాడుతూ ట్విర్లింగ్స్ చేస్తున్నాడు. దీంతో పిల్లీ తల గుండ్రంగా తిప్పతూ చూస్తున్నది. మధ్యలో అతడు ఆగిపోతే టీవీ దగ్గరకు వెళ్లి అతడిని నెట్టడానికి ట్రై చేసింది. ఎక్కడ తిరగడం ఆపేస్తాడో అని నెడుతూ కనిపించింది.

    ఇక మరోసారి ఇంకో జిమ్నాస్ట్ విన్యాసాలు చేస్తుండగా.. ఎక్కడ పడిపోతుందో అని పిల్లి పట్టుకోవడానికి ప్రయత్నించింది. పలుమార్లు ఆమె పడిపోకుండా ఆపడానికి ప్రయత్నించడం చూసిన వాళ్లకు నవ్వు మాత్రమే కాదు ఆ పిల్లిపై జాలి కూడా కలిగింది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నది. 'హ్యూమర్ అండ్ యానిమల్' అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేయగా.. ఇప్పటి వరకు 9 లక్షల వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది షేర్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా మంది తమ పెంపుడు పిల్లులు సెయిలింగ్, ఆర్చరీ వంటివి చూస్తున్నారు అనే వీడియోలు కూడా షేర్ చేశారు.





    ఏదేమైనా ఒలింపిక్స్ సందర్భంగా ఈ పిల్లి మాత్రం చాలా ఫేమస్ అయిపోయింది.
    Published by:John Naveen Kora
    First published: