CAPTAIN VIRAT KOHLI RECORD IN LORDS IS UNEXPECTED JUST CHECK WHO DECLARED INNINGS IN 89 YEARS OF LORD TEST HISTORY JNK
India Won 2nd Test: 89 ఏళ్ల రికార్డు.. ఎవరూ సాధించలేని ఆ ఫీట్ కోహ్లీ చేసి చూపించాడు..
లార్డ్స్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. 89 ఏళ్ల తర్వాత బద్దలు (PC: BCCI)
1932లో భారత జట్టు తొలి సారిగా లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడినా.. ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కానిది.. సోమవారం కోహ్లీ చేసి చూపించాడు. అదేంటో ఒకసారి చూడండి.
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లోభారత జట్టు అద్బుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అసలు చివరి రోజు భారత జట్టు గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. మహా అయితే డ్రా చేయడానికి ప్రయత్నిస్తుందని అనుకున్నారు. కానీ కోహ్లీ సేన లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టును ఒక ఆట ఆడుకుంది. ఐదో రోజు లార్డ్స్ మైదానంలో సరైన సమయంలో డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు 272 పరుగుల లక్ష్యాన్ని ఉంచాడు. 60 ఓవర్లలో 4 పైగా రన్‌రేట్‌తో చివరి రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయడం ఏ జట్టుకైనా అసాధ్యమే. మరోవైపు భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. 89 ఏళ్ల చరిత్రలో లార్డ్స్‌లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఏకైక భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. టీమ్ ఇండియా తొలి సారిగా 1932లో లార్డ్స్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇప్పటి వరకు భారత జట్టు 19 టెస్టులు ఆ చాతిత్రాత్మక మైదానంలో ఆడింది. కానీ ఏ కెప్టెన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. మరోవైపు 19 టెస్టుల్లో భారత జట్టు కేవలం 3 టెస్టులే గెలిచింది. 1986లో కపిల్ కెప్టెన్సీలో తొలి సారి లార్డ్స్‌లో మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత 2014లో ధోనీ కెప్టెన్సీలో గెలవగా... ఆ తర్వాత 7 ఏళ్లకు కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు లార్డ్స్ టెస్టు గెలిచింది.
లార్డ్స్ టెస్టులో విజయానంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ జట్టు మమ్మల్ని కవ్వించడం వల్లే మ్యాచ్ గెలిచామని చెప్పాడు. అన్ని రోజులూ మా వ్యూహాలను సరిగా అమలు చేసుకుంటూ వచ్చాము. మొదటి మూడు రోజులు పిచ్ సరిగా సహకరించలేదు.. కానీ తర్వాత మా బౌలర్లు చక్కగా రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా, షమి ఆడిన తీరు అత్యద్బుతం. కష్టాల్లో వాళ్లు మాకు అండగా నిలిచారు. నిజంగా వారి ఆటకు వందనం చెప్పొచ్చు అని కోహ్లీ అన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లు చేసిన పరుగులకు మేం విలువ కట్టలేమని కోహ్లీ అన్నాడు. భారత టెయిలెండర్లు పరుగులు చేయలేరని ఎన్నో అపవాదులు ఉన్నాయి. వాటన్నింటికీ బుమ్రా, షమీ చెక్ పెట్టారు. ఇక లార్డ్స్ మైదానంలో మ్యాచ్ గెలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
లార్డ్స్‌లో చివరి సారిగా ధోనీ సారథ్యంలో ఆడినప్పుడు గెలిచాము. ఆ మ్యాచ్ నేను కూడా ఆడాను. అది నాకు చాలా ప్రత్యేకమైనది. మళ్లీ ఇప్పుడు గెలుపులో భాగస్వామిగా ఉన్నాను. మేం 60 ఓవర్ల లోపే ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేసి ఫలితాన్ని రాబట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. బుమ్రా, ఇషాంత్, షమీతో పాటు సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అతడు ఇక్కడ తొలి సారిగా ఆడుతున్నాడు. అయినా అద్భుతంగా బౌలింగ్ చేశాడని కోహ్లీ చెప్పాడు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.