Home /News /sports /

CAPTAIN ROHIT SHARMA BECAME THE DRIVER TEAM INDIA STUNT WENT VIRAL VIDEO IND VS WI SJN

Rohit Sharma : డ్రైవర్ గా రోహిత్.. క్లీనర్ గా కార్తీక్.. వీళ్ల రచ్చ మామూలుగా లేదుగా.. (వీడియో)

PC : BCCI

PC : BCCI

Rohit Sharma : వెస్టిండీస్‌ (West Indies)తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ను టీమిండియా (Team India) 4-1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి టి20లో భారత్ 88 పరుగుల తేడాతో విండీస్ పై గెలిచిన సంగతి తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Rohit Sharma : వెస్టిండీస్‌ (West Indies)తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ను టీమిండియా (Team India) 4-1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి టి20లో భారత్ 88 పరుగుల తేడాతో విండీస్ పై గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma)కు విశ్రాంతి ఇవ్వగా.. అతని స్థానంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్ గా వ్యవహరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజెంటేషన్ సమయంలో రోహిత్ శర్మ డ్రైవర్ గా మారిపోయాడు. అదే సమయంలో దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) క్లీనర్ గా మారిపోయి అభిమానుల ముందు రచ్చ రచ్చ చేశారు.

మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్ లో ఉన్న గోల్ఫ్ కారును రోహిత్ శర్మ నడిపాడు. డ్రైవర్ గా మారిన అతడు గోల్ఫ్ కారును నడుపగా.. వెనకాల దినేశ్ కార్తీక్ కూర్చోని క్లీనర్ పాత్ర పోషించాడు. ఇక అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్ రోహిత్ పక్కన కూర్చుకున్నాడు. వీరు గ్రౌండ్ మొత్తం తిరుగుతూ మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. మరికాసేపటికే రిషబ్ పంత్, సంజూ సామ్సన్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవి బిష్ణోయ్ లు కూడా ఈ గోల్ఫ్ కారును ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోను విండీస్ క్రికెట్ తో పాటు, బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





ఈ సిరీస్‌లో టీమిండియా యువ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అర్ష్‌దీప్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్ గా అలరించాడు. అదే సమయంలో తనకు లభించిన అవకాశాలను సంజూ సామ్సన్ కూడా చక్కగా ఉపయోగించుకున్నాడు. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన ప్రయోగాలు విజయవంతం కావడం విశేషం. ఈ సిరీస్ అనంతరం జింబాబ్వేతో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం ఈ నెల 27 నుంచి ఆరంభమయ్యే ఆసియా కప్ లో భారత్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ సోమవారం జట్టును కూడా ప్రకటించింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India Vs Westindies, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rohit sharma, Sanju Samson, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు