Virat Kohli Ego: కోహ్లీ భయ్యా.. అహాన్ని మడిచి పెట్టుకోమన్నావ్.. మరి ఈ రోజు ఏంటి ఇలా చేశావ్?

కోహ్లీ.. ఏమైంది నీ అహం సిద్దాంతం.. ఫ్యాన్స్ ఫైర్ (PC: BCCI/Twitter)

Captain Kohli Ego: కెప్టెన్ కోహ్లీ చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతనే ఉండటం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నాడు. అహం మడిచి జేబులో పెట్టుకొని బ్యాటింగ్ చేయాలని చెప్పిన కొద్ది గంటల్లోనే భారత జట్టు అతి తక్కువ స్కోరుకు ఆలౌట్ అవడంపై భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

 • Share this:
  ఇంగ్లాండ్ పర్యటనలో (England tour) భారత జట్టు (Team India) లార్డ్స్ మైదానంలో (The Lord's) చారిత్రాత్మిక విజయం సాధించింది. తొలి టెస్టులో కూడా గెలుపు అంచుల వరకు వచ్చినా వర్షం కారణంగా మ్యాచ్ డ్రా చేసుకున్నది. తొలి రెండు టెస్టుల్లో భారత్‌దే పై చేయి అయ్యింది. అయితే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ (Virat Kohli) విజయం సాధించినా.. బ్యాట్స్‌మాన్‌గా మాత్రం ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన కోహ్లీ.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే అవుటైపోయాడు. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ సెంచరీ చేయక దాదాపు రెండేళ్లు కావొస్తున్నది. సెంచరీ కాకపోయినా కనీసం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడట్లేదు. దీంతో కోహ్లీ ఫామ్‌పై అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లీడ్స్‌లో (Leeds Test) ప్రారంభమైన మూడో టెస్టుకు ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో కోహ్లీ బ్యాటింగ్‌పై విలేఖరులు ప్రశ్నలు అడిగారు. దీనికి కోహ్లీ కాస్త ఘాటుగానే సమాధానం చెప్పాడు. ఇంగ్లాండ్‌లో మీ బ్యాటింగ్ ప్రదర్శన సరిగా లేదు కదా.. దీనిపై మీ స్పందన ఏంటి అని అడిగారు. దీనికి కోహ్లీ సమాధానం ఇస్తూ.. ఇంగ్లాండ్ పిచ్‌లపై ఆడుతున్నప్పుడు మన అహాన్ని తీసి జేబులో పెట్టుకోవాలి. మనం గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్ అయినా సరే ఇక్కడ పరిస్థితులకు ఓపిక పట్టాలి. చాలా క్రమశిక్షణగా ఆడితే కాని ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్ చేయలేము అని సమాధానం ఇచ్చాడు.

  కోహ్లీ అహాన్ని మడిచి జేబులో పెట్టుకోవాలని చెప్పి 24 గంటలు గడవక ముందే మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులకే అవుటైయ్యాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవీలియన్ చేరాడు. అంతే కాదు భారత బ్యాట్స్‌మెన్ అందరూ వరుసగా జేమ్స్ అండర్సన్ బంతులకు విలవిల్లాడారు. ఎవరు కూడా క్రీజులో కుదురుగా ఉండలేకపోయారు. కేఎల్ రాహుల్ (0), చతేశ్వర్ పుజార (1), కోహ్లీ (7) అండర్సన్ బౌలింగ్‌కు దాసోహమయ్యారు.

  కోహ్లీ చెప్పిన అహం సిద్దాంతం ఎటు పోయిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఒకపైపు 71వ సెంచరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్రతీ సారి కోహ్లీ నిరాశ పరుస్తున్నాడని.. అతడు కనీసం క్రీజులో పాతుకొని పోలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. ఆఫ్ సైడ్ నాలుగు, ఐదో వికెట్ పైన పడే బంతులను కూడా ఆడలేక సతమతమవుతున్నట్లు స్పష్టంగానే తెలిసిపోతున్నది. పదే పదే ఇవే బంతులకు అదే బౌలర్ చేతికి చిక్కడంతో కోహ్లీ అభిమానులు చాలా నిరాశకు గురవుతున్నారు. పదేపదే ఆఫ్ సైడ్ బంతుల బలహీనతను కోహ్లీ అధిగమించలేక పోతున్నాడని బాధపడుతున్నారు.
  Published by:John Naveen Kora
  First published: