IPL 2020: ఐపీఎల్‌ను ర‌ద్దు చేస్తే బీసీసీఐకి ఎన్ని కోట్ల న‌ష్టమో తెలుసా?

ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐ భారీ ఎత్తున నష్టపోయేది. నివేదిక అంచనా ప్రకారం మీడియా హ‌క్కుల రూపంలో రూ. 3300 కోట్లు,టైటిల్ స్పాన్స‌ర్ వీవో నుంచి రూ, 440 కోట్ల,స్పాన్సర్ల నుంచి 170 కోట్ల ఆదాయం బోర్డుకు అందుతుంది.

Rekulapally Saichand
Updated: July 24, 2020, 5:51 PM IST
IPL 2020: ఐపీఎల్‌ను ర‌ద్దు చేస్తే బీసీసీఐకి ఎన్ని  కోట్ల న‌ష్టమో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
IPL 2020 రద్దు అయితే జరిగే నష్టం ఏంతో తాజాగా విడుదల వెల్లడించింది. సుమారు నాలుగు వేల కోట్ల న‌ష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు నివేదిక సూచించింది. అందుకే భారీ నష్టాన్ని ముందే ఊహించిన బీసీసీఐ ఎలాగైనా ఈవెంట్ నిర్వహించాలని ప్రణాళికలు రచించింది. అసియా కప్,టీ20 వరల్డ్ కప్ రద్దు అవడం కూడా బీసీసీకి లాభించింది. కరోనా మహమ్మారి విజృణలో కూడా ఈవెంట్ జరపాలనే కృతనిశ్చయంతో ఉంది. ఇండియాలో ఐపీఎల్ నిర్వహణకు సానుకూల పరిస్థితులు లేకపోవడంతో యుఏఈలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.

ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐ భారీ ఎత్తున నష్టపోయేది. నివేదిక అంచనా ప్రకారం మీడియా హ‌క్కుల రూపంలో రూ. 3300 కోట్లు,టైటిల్ స్పాన్స‌ర్ వీవో నుంచి రూ, 440 కోట్ల,స్పాన్సర్ల నుంచి 170 కోట్ల ఆదాయం బోర్డుకు అందుతుంది. ఒక్కవేళ ఐపీఎల్ జరగకుండా 4000 వేల కోట్ల ఆదాయాన్ని బీసీసీఐ కోల్పోయి ఉండేది.

ఇప్పటికే స్టార్ గ్రూప్ రెండు వేల కోట్ల అడ్వాన్స్ చెల్లించింది. ఒక్కవేళ IPL 2020 కనుక రద్దయి ఉంటే ఈ వ్వవహారం కోర్టు వరకు వెళ్ళేది. చూస్తూ..చూస్తూ కోర్టు మెట్లు ఎక్కే అంతా వరకు పరిస్థితి తెచ్చుకోవద్దు అనుకున్న బోర్డు ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఐపీఎల్‌ను నిర్వహించాలని గట్టి పట్టుదలతో ఉంది. దీంతో టీ20 వరల్డ్ కప్ రద్దు కాగానే ఐపీఎల్ నిర్వహణకు సన్నహాలు మెుదలు పెట్టింది.
Published by: Rekulapally Saichand
First published: July 24, 2020, 5:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading