Kapil Dev: యాంజియోప్లాస్టీ అనంతరం ఫోటో షేర్ చేసిన కపిల్.. ఏమన్నాడంటే..

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్(Kapil Dev) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు గుండెనొప్పి రావడంతో ఢిల్లీలోని పోర్టిస్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

news18-telugu
Updated: October 24, 2020, 12:47 PM IST
Kapil Dev: యాంజియోప్లాస్టీ అనంతరం ఫోటో షేర్ చేసిన కపిల్.. ఏమన్నాడంటే..
ఆస్పత్రిలో కపిల్‌దేవ్
  • Share this:
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్(Kapil Dev) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు గుండెనొప్పి రావడంతో ఢిల్లీలోని పోర్టిస్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు చెప్పారు. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక, తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కపిల్‌కు సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది.

1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యులంతా వాట్సాప్‌లో ఓ గ్రూప్‌ను రన్ చేస్తున్నారు. ఇందులో వారికి సంబంధించిన విశేషాలు.. అలాగే ఆసక్తికరమైన విశేషాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే కపిల్ అనారోగ్యానికి గురయ్యాడని తెలియడంతో.. అతని మాజీ టీమ్‌మేట్స్ ఆ దిగ్గజ క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మెసేజ్‌లు పెట్టారు. అయితే దీనికి ఇచ్చిన రిప్లైలో.. తాను క్షేమంగానే ఉన్నానని కపిల్ తెలిపారు. "అందరికీ నమస్కారం. నేను మంచి ఉత్సాహంతో ఉన్నాను. బాగానే ఉన్నాను. వేగంగా కోలుకుంటున్నాను. నా గోల్ఫ్ ఆటకు తిరిగి రావడానికి వేచి ఉండలేను. మీరంతా నా కుటుంబం. థ్యాంక్యూ" అని కపిల్ పేర్కొన్నాడు.

మరోవైపు తన ఆరోగ్యానికి సంబంధించి కపిల్ సోషల్ మీడియాలో కూడా ఓ పోస్ట్ చేశారు. తనపై ప్రేమను చూపిన ప్రతి ఒక్కరి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది తాను త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపారని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని చెప్పారు.



ఇక, ప్రస్తుతం ఢిల్లీలోని సుందర్ నగర్‌లో నివాసం ఉంటున్న ఆయనకు శుక్రవారం గుండెనొప్పి రావడంతో పోర్టిస్-ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారు. ఈ మేరకు ఆ ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. "అక్టోబర్ 23వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు కపిల్ దేవ్.. మా హాస్పిటల్‌లోని ఎమర్జేన్సీ విభాగంలో అడ్మిట్ అయ్యారు. గుండెనొప్పితో ఆయన హాస్పటిల్‌లో చేరడం జరిగింది. యాంజియోప్లాస్టీ అనంతరం.. కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ డైరక్టర్ అతుల్ మథుర్ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మరో రెండు మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది"అని ఆస్పత్రి తెలిపింది.
Published by: Sumanth Kanukula
First published: October 24, 2020, 12:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading