Ganguly Fined: సౌరవ్ గంగూలీకి కోల్‌కతా హైకోర్టు జరిమానా... అసలు కారణం ఇదే

సౌరవ్ గంగూలీకి జరిమానా విధించిన కోల్‌కతా హైకోర్టు (PC: BCCI)

Ganguly Fined: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కోల్‌కతా హైకోర్టు జరిమానా విధించింది. ఒక భూకేటాయింపు విషయంలో నిబంధనలు అతిక్రమించారని పేర్కొంటూ గంగూలీకి జరిమానా విధించినట్లు తెలుస్తున్నది.

  • Share this:
    బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి (Sourav Ganguly) కోల్‌కతా హైకోర్టు (High Court) జరిమానా విధించింది. ఒక భూకేటాయింపు విషయంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు గంగూలీకి రూ. 10వేలు జరిమానాగా విధించింది. అంతే కాకుండా ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బెంగాల్ ప్రభుత్వం (Bengal Government), హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలెప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెరి రూ. 50 వేల జరిమానా విధించింది. గంగూలీకి ఒక పాఠశాల భవన నిర్మాణం కోసం అక్రమ పద్దతుల్లో భూకేటాయింపు జరిగిందని హైకోర్టులో పిల్ నమోదు అయ్యింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అక్రమాలు జరిగింది నిజమేనని తేల్చింది.

    బెంగాల్ ప్రభుత్వం 2009లో సౌరవ్ గంగూలీకి సాల్ట్ లేక్‌లో ఒక ఫ్లాట్ కేటాయించింది. అయితే ఆ కేటాయింపును 2011లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంతే కాకుండా గంగూలీకి ఫ్లాట్ కేటాయింపులో ఎలాంటి నిబంధలను పాటించలేదని.. అందుకే ఫ్లాట్ కేటాయింపు రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత 2013లో మరోసారి గంగూలీకి కోల్‌కతా సమీపంలో రెండెకరాల భూమిని పాఠశాల కోసం కేటాయించింది. ఈ కేటాయింపుపై కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా రెండో సారి గంగూలీకి భూకేటాయింపు జరిగిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు ద్విసభ్య బెంచ్ పిటిషన్‌దారుడితో ఏకీభవించింది. సుప్రీంకోర్టు ఏ నిబంధనల కింద భూకేటాయింపు రద్దు చేసిందో.. తిరిగి అవే నిబంధనల కింద ఎలా కేటాయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అయితే గంగూలీ ఇప్పటికే ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి తిరిగి అప్పగించినందున రూ. 10వేల జరిమానాతో వదిలేసింది. బెంగాల్ ప్రభుత్వం, హైసింగ్ బోర్డు కార్పొరేషన్‌కు మాత్రం చెరి రూ. 50 వేలు కేటాయించింది.





    సౌరవ్ గంగూలీ ప్రభుత్వం యూఏఈలో ఉన్నారు. ఐపీఎల్ 2021 రెండో దశతో పాటు ఆ తర్వాత జరుగనున్న టీ20 వరల్డ్ కప్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఇక టీమ్ ఇండియా తరపున ఆడిన సౌరవ్ గంగూలీ కోల్‌కతా ప్రిన్స్‌గా పిలిచే వాళ్లు. భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
    Published by:John Naveen Kora
    First published: