Home /News /sports /

BWF World Tour Finals: ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డ తెలుగు తేజం పీవీ సింధు.. మరోసారి నిరాశే..

BWF World Tour Finals: ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డ తెలుగు తేజం పీవీ సింధు.. మరోసారి నిరాశే..

PV Sindhu

PV Sindhu

BWF World Tour Finals: సౌత్‌ కొరియాకు చెందిన యాన్‌ సియాంగ్‌ (An Seyoung ) చేతిలో 21-16,21-12 తేడాతో ఓటమి పాలైంది. సింధు మొదటి గేమ్‌ను 16-21 కోల్పోయింది. సింధు మొదటి గేమ్ చివరి దశలలో పోరాడినప్పటికీ, దక్షిణ కొరియా స్టార్‌ యాన్‌ సియాంగ్‌ అవకాశం ఇవ్వలేదు.

ఇంకా చదవండి ...
    తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) మరోసారి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ముగింపు టోర్నీ వరల్డ్‌టూర్‌ ఫైనల్స్‌ (BWF World Tour Finals)లో తెలుగు తేజం ఓటమి చెందింది. సౌత్‌ కొరియాకు చెందిన యాన్‌ సియాంగ్‌ (An Seyoung ) చేతిలో 21-16,21-12 తేడాతో ఓటమి పాలైంది. సింధు మొదటి గేమ్‌ను 16-21 కోల్పోయింది. సింధు మొదటి గేమ్ చివరి దశలలో పోరాడినప్పటికీ, దక్షిణ కొరియా స్టార్‌ యాన్‌ సియాంగ్‌ అవకాశం ఇవ్వలేదు. ఇక రెండో గేమ్‌లో సింధుకు సియాంగ్‌ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అయితే రన్నరప్‌గా నిలిచిన పీవీ సింధు, 10,200 పాయింట్లతో పాటు 60 వేల డాలర్లు (దాదాపు 45 లక్షల 15 వేల రూపాయలు) బహుమతిగా అందుకోనుంది.

    అంతకుముందు, శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ఈ టోక్యో బ్రాంజ్ మెడలిస్ట్ 21-15, 15-21, 21-19 తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యమగూచి (జపాన్‌)పై పోరాడి గెలిచింది. ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ పట్టుదలతో ఆడిన సింధు గంటా 10 నిమిషాల్లో మ్యాచ్‌ ముగించింది. తొలి గేమ్‌ ఆరంభంలో 0-4తో వెనకబడ్డ ఈ భారత షట్లర్‌ బలంగా పుంజుకుంది. తనదైన శైలి ఆటతీరుతో చెలరేగింది. క్రాస్‌ కోర్టు షార్టులు, డ్రాప్‌లు, స్మాష్‌లతో అదరగొట్టింది.

    ఇది కూడా చదవండి : " రెస్పెక్ట్ " అంటూ అప్పును గుర్తు చేసిన డేవిడ్ బాయ్.. ఆర్సీబీకీ ఆడటం ఖాయమేనా..?

    మరోవైపు ప్రత్యర్థి కూడా వెనక్కి తగ్గకపోవడంతో పోరు హోరాహోరీగా మారింది. కానీ కీలక దశలో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 18-15తో ఆధిక్యంలో నిలిచింది. అదే జోరులో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ తొలి భాగంలోనూ షట్లర్లిద్దరూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో ఓ దశలో 10-10తో స్కోరు సమమైంది. కానీ ఈ గేమ్‌లో విరామం తర్వాత ప్రపంచ మూడో ర్యాంకర్‌ యమగూచి జోరు ముందు సింధు నిలవలేకపోయింది.

    ఇది కూడా చదవండి :  రొమాంటిక్ నైట్ డేట్ కు వెళ్లిన సచిన్ కూతురు.. సారా చేయి పట్టుకున్న వ్యక్తి ఎవరు..?

    ప్రత్యర్థి తెలివిగా ఆడుతూ పాయింట్లు రాబట్టి ఆ గేమ్‌ గెలుచుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో వీళ్లిద్దరి మధ్య పోరు మరో స్థాయికి చేరింది. విజయం కోసం ఇద్దరూ ప్రాణం పెట్టి పోరాడారు. ఓ దశలో 17-12తో సింధు సులువుగానే గెలిచేలా కనిపించింది. కానీ యమగూచి పోరాటానికి సింధు అనవసర తప్పిదాలూ జత కావడం ప్రత్యర్థికి కలిసొచ్చింది. దీంతో 19-19తో చివర్లో తీవ్ర ఉత్కంఠ రేగింది. కానీ తీవ్ర ఒత్తిడిలోనూ మెరుగ్గా ఆడిన ఆమె వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Badminton, Pv sindhu, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు